తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని సిద్ధమవుతున్న భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త తెలిపారు. డిసెంబర్ నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగానే నవంబర్ 11న ఉదయం 10 గంటల నుంచి స్లాట్ ఓపెన్ కానుంది.
డిసెంబర్ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. ఇక డిసెంబర్ నెలలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడాది ముగింపు కావడం ఉద్యోగులు సెలవులు ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరగనుందని సమాచారం.
The Rs.300 Special Entry Darshan tickets for the month of December will be released by TTD on November 11 by 10 am. Devotees can book the tickets on TTD official website.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) November 9, 2022
ప్రత్యేక దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. రిజిస్టర్ చేసుకోవాలి. లేదూ ముందుగానే రిజిస్టర్ చేసుకుని ఉంటే లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. ఈ తర్వాత లేటెస్ట్ అప్‌డేట్‌లో ఉండే రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్ చేయాలి. ఇక తర్వాత మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెలక్ట్ చేసుకొని అమౌంట్ పే చేస్తే సరిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..