Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్లైన్లో దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు.. ఈ నెలలోనే..
తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. జనవరి కోటాకు సంబంధించిన టికెట్లను ఈ నెలలో విడుదల చేస్తోంది. ఈ మేరకు తేదీలను ప్రకటించింది. దీంతో భక్తులు ఆన్లైన్లో దర్శన టికెట్లను పొందవచ్చు.

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం పొందాలనుకునేవారికి టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది. వివిధ దర్శన కేటగిరీలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి నెల కోటా దర్శన టికెట్లను ఈ నెలలో రిలీజ్ చేస్తోంది. ఈ మేరకు టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. భక్తులు ఆన్లైన్ ద్వారా దర్శన టికెట్లను బుక్ చేసుకుని ఆయా తేదీల్లో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఏయే తేదీల్లో ఏ దర్శన టికెట్లను రిలీజ్ చేస్తున్నారనేది చూద్దాం.
దర్శన టికెట్ల విడుదల తేదీ ఇవే..
-అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు
-అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసది గదుల కోటాను రిలీజ్ చేయనున్నారు
-అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వయోవృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బాధపడుతున్నవారికి ఉచిత ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు
-అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు రిలీజ్ చేయనున్నారు
-అక్టోబర్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను రిలీజ్ చేస్తారు
-అక్టోబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చవల్ సేవల టికెట్లు విడుదల చేస్తారు
-అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవల లక్కీ డిప్ టికెట్లను విడుదల చేస్తారు. ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు చేసుకోవచ్చు. డిప్లో ఎంపికైన భక్తులు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు రుసుం చెల్లించి టికెట్లు కన్పార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది
– లక్కీ డిప్ కోటాలో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు అందుబాటులో ఉంటాయి
టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..?
https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. టీటీడీ విడుదల చేయకముందే మీరు మొబైల్ నెంబర్ ద్వారా వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. టికెట్లను విడుదల చేయగానే ఆ లింక్ను క్లిక్ చేసి ఏ దర్శన తేదీని ఎంచుకోవాలి. అనంతరం భక్తల పేర్లు, వయస్సు, ఆధార్ నెంబర్లను నమోదు చేయాలి. ఆ తర్వాత యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులల ద్వారా పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టికెట్ కన్పార్మ్ అయినట్లు మీకు రసీద్ వస్తుంది. దానిని మీరు డౌన్ లోడ్ చేసుకుని దర్శన సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
