AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమలలో భారీ రద్దీ.. నవంబర్ 1 నుంచి సర్వదర్శనం టోకెన్లు.. వీఐపీ దర్శనాల్లో మార్పులు..

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 1 నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు. టోకన్లు లేని భక్తులకు యధావిధిగా..

TTD: తిరుమలలో భారీ రద్దీ.. నవంబర్ 1 నుంచి సర్వదర్శనం టోకెన్లు.. వీఐపీ దర్శనాల్లో మార్పులు..
YV Subbareddy
Ganesh Mudavath
|

Updated on: Oct 30, 2022 | 6:36 AM

Share

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 1 నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు. టోకన్లు లేని భక్తులకు యధావిధిగా దర్శనం కల్పిస్తామన్నారు. డిసెంబర్ నెల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 5 గంటలకు పంపించే వీఐపీలను 8.30 నిమిషాలకు పంపిస్తామని పేర్కొన్నారు. తొలుత 10 గంటలకు వీఐపీలకు దర్శనం కల్పించాలని నిర్ణయించామని.. కానీ కల్యాణోత్సవం భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్న కారణంతోనే ఉదయం 8.30కి పంపించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తిరుమలలో క్షురకుల సమస్య పరిష్కారమైందన్న సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.54 లక్షల రూపాయలతో ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రం నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

కాగా.. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు తిరుమలకు భారీగా వచ్చారు. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్‌ రోడ్డులోని సేవాసదన్‌ వరకు భక్తులు క్యూ కట్టారు. వీరికి దాదాపు 22 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుంది. గదుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. శుక్రవారం శ్రీవారిని 63,512 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.72 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. అయితే తిరుమలలో కురుస్తున్న వర్షం కారణంగా చలి తీవ్రత అధికమైంది.

మరోవైపు.. నాగులచవితి ప‌ర్వదినాన్ని పుర‌స్కరించుకుని శ్రీనివాసుడికి పెద్ద శేష వాహన సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శన‌మివ్వగా పెద్దసంఖ్యలో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..