Toli Ekadashi: పాలంక వీరభద్రుడి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. కొండచరియ నుండి జారిన నీటి చుక్కలు తాగితే పిల్లలు పుడతారని నమ్మకం

|

Jul 10, 2022 | 4:44 PM

దట్టమైన నల్లమల అరణ్యం లోని లోయలో కొండ చరియ క్రింద వెలసి ఉన్న పురాతన పాలంక వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు..

Toli Ekadashi: పాలంక వీరభద్రుడి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. కొండచరియ నుండి జారిన నీటి చుక్కలు తాగితే పిల్లలు పుడతారని నమ్మకం
Nallamala Palanka Kshetram
Follow us on

Toli Ekadashi: తొలి ఏకాదశి పండుగ సందర్భంగా నల్లమల దట్టమైన అడవిలో(Nallamala forest)  కృష్ణానది (Krishna River) ఒడ్డున ఉన్న పాలంక వీరభద్రుడి క్షేత్రానికి (Palanka Veerabhadra kshetram) పోటేత్తిన భక్తులు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో దట్టమైన నల్లమల అరణ్యం లోని లోయలో కొండ చరియ క్రింద వెలసి ఉన్న పురాతన పాలంక వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.. ఈ పాలంక క్షేత్రానికి పెళ్ళిళ్ళు జరిగి సంవత్సరాలు గడిచిన సంతానం కలగని దంపతులు ఎక్కువ వస్తుంటారు. స్వామి అమ్మవారి గుడి పై భాగంలో ఉన్న కొండచరియ నుండి నీటి చుక్కలు జాలు వారుతుంటాయి, ఆ నీటి చుక్కలు సంతానం లేని దంపతుల అరచేతిలో పడితే సంతానం కలుగుతుందనేది భక్తుల అత్యంత విశ్వాసం.

ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు సంతానం కల్గితే మగపిల్లలకు, పాలంకయ్య, పాలంవీరయ్య, వీరయ్య,వీరభద్రుడు, ఆడపిల్లలు అయితే పాలంకమ్మ, భద్రకాళి, భద్రమ్మ, సుభద్ర అని పేర్లు పెట్టుకొని ఉత్సవంవేళ వారి సంతానానికి పుట్టు వెంట్రుకలు తీయించడం భక్తులకు అనవాయితీ. ఈ పురాతన పాలంక క్షేత్రమును దర్శించుకునేందుకు ప్రకాశం, గుంటూరు, కర్నూలు, జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..