Tirumala: జూన్‌ 1 నుంచి 5 వరకు తిరుమ‌ల‌లో హనుమత్‌ జయంతి ఉత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న టీటీడీ

| Edited By: Surya Kala

May 04, 2024 | 9:47 AM

హనుమత్‌ జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామివారికి విశేష అభిషేక, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామాన్నారు. హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు.

Tirumala: జూన్‌ 1 నుంచి 5 వరకు తిరుమ‌ల‌లో హనుమత్‌ జయంతి ఉత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న టీటీడీ
Hanuman Jayanthi
Follow us on

తిరుమలలోని ఆకాశగంగ వద్ద శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్‌ 1 నుండి 5 వరకు ఐదు రోజుల పాటు హనుమత్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.  జన్మ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జూన్‌ 1న శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి
వారికి విశేషంగా తిరుమంజనం కార్యక్రమం నివహించనున్నారు. 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామాన్నారు టిటిడి ఇఓ ధర్మారెడ్డి.

హనుమత్‌ జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామివారికి విశేష అభిషేక, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామాన్నారు. హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు.  తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్‌ 2న ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుందన్నారు. సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారని ధర్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..