Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ

|

Dec 14, 2024 | 5:07 PM

ధనుర్మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు వారు ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా జరుపుకుంటారు. విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈరోజున ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. అంతేకాదు జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ
Vaikunta Dwara Darshan
Follow us on

వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారా ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్య ప్రదమని భక్తుల నమ్మకం. ఈ నేపధ్యంలో తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. ధనుర్మాసంలోని శుక్లపక్షం 11 వ రోజున వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి కొత్త సంవత్సరం జనవరి 10న వచ్చింది. దీంతో శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శినుకునే వీలుని భక్తులకు పది రోజుల పాటు కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

అంతేకాదు ఈ శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనాల నేపధ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి వస్తారని అంచనా వేసిన సిబ్బంది సామాన్య భక్తుల సౌకర్యార్ధం అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. అంతేకాదు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు

  1. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవదర్శనంవల్ల సకల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. దీంతో ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తే భక్తులకు కీలక సూచనలు చేసింది. కేవలం దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
  2. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తామని.. అయితే దర్శనం చేసుకునే అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
  3. ఇవి కూడా చదవండి
  4. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏడాది లోపు పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
  5. వైకుంఠ ద్వార దర్శనాల నేపధ్యంలో ఈ పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
  6. భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్ లో ఎదురుచూసే సమయాన్ని తగ్గింఛి.. ఎక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.
  7. గోవిందమాల ధరించిన భక్తులకు ఎటువంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని.. కేవలం దర్శన టోకెన్లు, లేదా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది.
  8. భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచించింది.
  9. అంతేకాదు వైకుంఠ ఏకాదశి రోజుజైన జనవరి 10 వ తేదీన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను దర్శనానికి అనుమతించరు. వీటికి మర్నాడు అంటే జనవరి 11 వ తేదీ నుంచి 19వ తేది వరకు దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ తెలిపింది.
  10. వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం నేపధ్యంలో 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుందని వెల్లడించింది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.