Tirumala Temple: వడ్డీకాసులవాడి ఆస్తుల విలువ లెక్కతేలింది.. స్వామివారికి ఎన్నివేల కోట్ల భూములు, బంగారం, నగదు ఉందో తెలుసా..

| Edited By: Janardhan Veluru

Sep 26, 2022 | 5:31 PM

1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్ట్‌ బోర్డులు స్వామివారికి చెందిన 113 ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. 2014 తర్వాత ఇప్పటి వరకు టీటీడీ ఎలాంటి ఆస్తులు అమ్మలేదని తెలిపారు.

Tirumala Temple: వడ్డీకాసులవాడి ఆస్తుల విలువ లెక్కతేలింది..  స్వామివారికి ఎన్నివేల కోట్ల భూములు, బంగారం, నగదు ఉందో తెలుసా..
Srivari Properties
Follow us on

Tirumala Properties: ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంత సంపన్న ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా  భక్తుల రద్దీతో సందడిగా ఉంటుంది తిరుమల తిరుపతి క్షేత్రం. కలియుగ ప్రత్యక్షదైవం అయిన వడ్డీకాసులవాడికి భక్తులు భూరి విరాళాలను సమర్పిస్తుంటారు. తాజాగా కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కతేలింది. వాటికి సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా శ్రీవారికి వున్న ఆస్తుల విలువ రూ.85,705 కోట్లు కాగా టీటీడీకి దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఉన్నాయి. 14 టన్నుల బంగారం కూడా శ్రీవారి సొంతం. శ్రీవారి ఆస్తుల విలువ మార్కెట్ విలువ కనీసం 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని.. సుమారు రూ. 2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 960 స్థిర ఆస్తులు ఉండగా, వాటి విలువ రూ.85,705 కోట్లు. స్వామివారి పేరుతో 7123 ఎకరాల భూమి ఉంది.  1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్ట్‌ బోర్డులు స్వామివారికి చెందిన 113 ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. 2014 తర్వాత ఇప్పటి వరకు టీటీడీ ఎలాంటి ఆస్తులు అమ్మలేదని తెలిపారు. టీటీడీకి ఉన్న ఆస్తులు, వాటి విలువలను టీటీడి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. 2018-19న కేవ‌లం హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం లభించింది. టీటీడీ చరిత్రలోనే తిరుమలేశుడికి ఒకే నెలలో రూ.139.45 కోట్ల ఆదాయం   2022 జులై నెలలో లభించింది. కాగా ఇప్పటివరకు అత్యధిక సింగిల్ డే రికార్డు రూ.6.45 కోట్లు ఆదాయం వచ్చినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

టీటీడీ బడ్జెట్: 
2020-21 లో రూ.3309 కోట్ల బడ్జెట్ వేసిన టీటీడీ.. 2021-22లో కేవలం 2937.82 కోట్లకు మాత్రమే పరిమితం చేసింది. అయితే 2022-23 ఏడాదికి గాను టీటీడీ  బడ్డెట్ ను స్వల్పంగా పెంచిన రూ.3096.40 కోట్లు కేటాయించింది.

ఇవి కూడా చదవండి

 మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..