AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం.. భక్తులకు అందుబాటులోకి వచ్చిన పుష్కరిణి

తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మ‌తు పనులు పూర్తయి కొత్త హంగులతో స్వామి పుష్కరిణి ఈ రోజు నుంచే భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. మర‌మ్మ‌తు పనులను టీటీడీ జూలై 20 న ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tirumala: వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం.. భక్తులకు అందుబాటులోకి వచ్చిన పుష్కరిణి
Tirumala Tirupati
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Aug 21, 2025 | 9:08 AM

Share

తిరుమలకు బ్ర‌హ్మోత్స‌వ శోభ వస్తోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప‌రిశీలించిన టీటీడీ ఈవో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. సెప్టంబ‌ర్ 24 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు తిరుమ‌ల‌లో జరగనున్నాయి. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్ల‌ను టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాజు, టీటీడీ సీవీఎస్వో ముర‌ళీకృష్ట‌లు క‌లిసి పరిశీలించారు. గ్యాల‌రీల్లో భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా వాహ‌న సేవ‌ల‌ను వీక్షించేలా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. సెప్టంబ‌ర్ మొద‌టి వారంలోపు ఇంజినీరింగ్ ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. సెప్టంబ‌ర్ 24న ధ్వ‌జారోహ‌ణం రోజు సీఎం చంద్ర‌బాబు దంపతులు శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నార‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై క్షేత్రస్థాయిలో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. మాడ వీధుల్లో అద‌న‌పు మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. పారిశుధ్యం కోసం అద‌న‌పు సిబ్బంది నియ‌మించ‌నున్న‌ట్లు ఈఓ శ్యామల రావు తెలిపారు.

గ్యాల‌రీల్లో ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం.

బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు గ్యాల‌రీల్లో ఉన్న ప్ర‌తి భ‌క్తుడికి అన్న ప్ర‌సాదాలు అందేలా ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఈఓ పేర్కొన్నారు. గ‌త ఏడాది గ‌రుడ‌ వాహ‌న సేవ‌కు 3 ల‌క్ష‌ల‌కు పైగా భ‌క్తులు వచ్చారని అందుకనుగుణంగా ఈ ఏడాది అద‌న‌పు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. తిరుమ‌ల‌లో ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ముంద‌స్తుగా పార్కింగ్ ప్ర‌ణాళిక‌లు రూపొందించినట్లు చెప్పారు. తిరుప‌తిలో కూడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో తిరుమ‌ల‌కు వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

భక్తులకు అందుబాటులోకి వచ్చిన పుష్కరిణి.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మ‌తు పనులు పూర్తయి కొత్త హంగులతో స్వామి పుష్కరిణి ఈ రోజు నుంచే భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. మర‌మ్మ‌తు పనులను టీటీడీ జూలై 20 న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్వామివారి పుష్కరిణి లోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ రంగులు అద్దకంతో మరింతగా ఆకట్టుకుంటుంది. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణిని నింపిన టిటిడి అధికారులు ఈ మేరకు మర‌మ్మ‌తు పనులు పూర్తిచేశారు. స్వామి పుష్కరిణి మరమ్మ‌తు ప‌నుల‌ తో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపి వేసింది. ఇక భక్తులను సైతం నెల రోజులపాటు స్వామి వారి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. మరమత్తు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి పుష్క‌రిణీలోకి టిటిడి భక్తులను అనుమ‌తించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!