కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతిలో నిత్యం భక్తుల రద్దీ నెలకొంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. తమ శక్తి కొలది కానుకలను సమర్పించుకుంటారు. అయితే గత కొన్ని నెలలుగా స్వామివారికి ఆదాయం భారీగా వస్తోంది. వెంకన్నకు హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో లభిస్తుంది.
టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా 2022–23 ఆర్దిక సంవత్సరానికి స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల రూపంలో రోజూ దాదాపు ఐదు కోట్ల ఆదాయం లభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ దాదాపు 1520 కోట్ల 18 లక్షల ఆదాయం లభించింది. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. తిరుపతిపై మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండడంతో శ్రీవారికి హుండీ ద్వారా లభిస్తున్న ఆదాయం గణనీయంగా పెరిగింది.
గతేడాది ఏప్రిల్ నెలలో 127 కోట్ల 63 లక్షల ఆదాయం లభించగా.. మేనెలలో మరింత పెరిగి స్వామివారికి హుండీ ద్వారా 129 కోట్ల 93 లక్షల రూపాయల ఆదాయం లభించింది. జూన్ నెలలో 123 కోట్ల 73 లక్షల ఆదాయం,, జూలైలో 139 కోట్ల 46 లక్షల రూపాయలు లభించింది. అయితే టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఆదాయం ఆగస్టు నెలలో కానుకల ద్వారా లభించింది. టిటిడికి చరిత్రలోనే స్వామివారికి రికార్డు స్థాయిలో 140 కోట్ల 7 లక్షల రూపాయల ఆదాయం లభించింది. సెప్టెంబర్ లో రూ.. 122 కోట్ల 69 లక్షల రూపాయలు .. అక్టోబర్ లో 122 కోట్ల 23 లక్షలు, నవంబర్ లో 127 కోట్ల 30 లక్షలు ఆదాయం లభిస్తే డిసెంబర్ నెలలో 129 కోట్ల 49 లక్షలు ఆదాయం లభించింది.
ఈ ఏడాది జనవరిలో 123 కోట్ల 4 లక్షలు లభించగా ఫిబ్రవరిలో 114 కోట్ల 29 లక్షలు.. మార్చిలో 120 కోట్ల 29 లక్షల ఆదాయం హుండీ ద్వారా స్వామివారి వారికీ లభించింది. దీంతో 2022 నుంచి 23 ఆర్ధిక ఏడాదికి గాను శ్రీవారికి మొత్తం రూ. 1520 కోట్ల 18 లక్షలు లభించిందని టీటీడీ సిబ్బంది పేర్కొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..