AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారికి భక్తులు సమర్పించిన మొబైల్ ఫోన్లు ఆన్ లైన్ లో వేలం.. ఎప్పుడంటే..

కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపదల మొక్కుల వాడు తమ కోర్కెని తీర్చిన తర్వాత బూరి విరాళాలను, కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగరం వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నది టీటీడీ.

TTD: శ్రీవారికి భక్తులు సమర్పించిన మొబైల్ ఫోన్లు ఆన్ లైన్ లో వేలం.. ఎప్పుడంటే..
Auction Of Mobile Phones
Surya Kala
|

Updated on: Jun 19, 2025 | 1:20 PM

Share

కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపదల మొక్కుల వాడు తమ కోర్కెని తీర్చిన తర్వాత బూరి విరాళాలను, కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగరం వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నది టీటీడీ.

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుమల తిరుపతిలో ఉన్న ఇతర అనుబంధ ఆలయాలలో స్వామివారి భక్తులు మొబైల్ ఫోన్లను కానుకలుగా సమర్పిస్తున్నారు. ఇలా శ్రీవారికి కానుకగా భక్తులు సమర్పించిన ఉపయోగించినని లేదా పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను ఈ నెలలో వేలం వేయనున్నారు. ఈ నెల 20 , 21వ తేదీల్లో టిటిడి తమ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు.

కార్భన్, ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్ సహా మొబైల్ ఫోన్లు ఈఏఐడి నెం. 25132, 25133, 25134, 25135 ఆన్ లైన్ లో ఈ – వేలం వేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సెల్ ఫోన్లను ఖరీదు చేయాలనుకునే ఆసక్తి కల్గిన భక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అవ్వాలి. ఇలా రిజిస్టర్ అయిన వ్యక్తులు బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఈ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్థానిక జనరల్ మేనేజర్ లేదా ఏఈవోలను సంప్రదించాలి. లేదా తిరుపతిలో టిటిడి, హరే కృష్ణ మార్గ్, https://konugolu. ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..