Chanakya Wisdom: అమ్మాయిల్లో ఈ 7 శరీర భాగాలను బట్టి.. ఎలాంటి వారో తెలుసుకోవచ్చా? చాణక్యుడు చెప్పిన ఆ సీక్రెట్స్!
ఆచార్య చాణక్యుడు.. ఈ పేరు వినగానే ఆయన నీతి, తెలివితేటలు మనకు గుర్తుకొస్తాయి. శతాబ్దాలు గడిచినా నేటికీ ఆయన చెప్పిన సూక్తులు, నీతులు ప్రాముఖ్యాన్ని కోల్పోలేదు. ముఖ్యంగా స్త్రీల గురించి చాణక్యుడు తన 'చాణక్య నీతి' గ్రంథంలో చెప్పిన విషయాలు ఎంతో ఆలోచింపజేస్తాయి. కొన్ని లక్షణాలున్న స్త్రీలకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అవేంటో తెలుసుకుందాం..

చాణక్యుడి ప్రకారం, కొన్ని ప్రత్యేక లక్షణాలున్న స్త్రీలు కుటుంబానికి, సమాజానికి కీడు చేస్తారని, వారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఆ లక్షణాలు, శరీర భాగాల ఆధారిత వివరణలు. అవి ఏంటి? ఆయన దృష్టిలో కొన్ని శరీర భాగాల ఆధారంగా స్త్రీల స్వభావాలను ఎలా అంచనా వేశారు? 99 శాతం మందికి తెలియని ఆ “సీక్రెట్స్” ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెడ ఆకారం:
కొంతమంది స్త్రీలకు పొట్టి మెడ ఉంటుందని చాణక్యుడు చెప్పారు. పొట్టి మెడ ఉన్న స్త్రీలు ఇతరులపై ఆధారపడి జీవిస్తారని అంటారు. పొడవైన మెడ ఉన్న స్త్రీలు తమ కులానికే చెడు తలపెడతారని, చదునైన మెడ ఉన్న స్త్రీలు కోపంతో రగిలిపోయే స్వభావం కలిగి ఉంటారని చాణక్య నీతిలో పేర్కొన్నారు.
స్త్రీల కళ్ళు:
పసుపు రంగు కళ్ళు ఉన్న స్త్రీలకు భయం, కోపం ఎక్కువగా ఉంటాయట. బూడిద రంగు కళ్ళు ఉన్నవారు మంచి స్వభావం కలిగిన స్త్రీలని ఆయన వివరించారు.
నవ్వుతున్నప్పుడు సొట్టబుగ్గలు:
నవ్వుతున్నప్పుడు సొట్ట బుగ్గలు పడే స్త్రీల స్వభావం మంచిది కాదని చాణక్యుడు చెప్పినట్లు ప్రచారంలో ఉంది.
ఉబ్బిన నరాలు (చేతులపై):
చేతులపై ఉబ్బిన సిరలు, అసమానంగా ఉన్న చేతులు ఉన్న స్త్రీలకు జీవితంలో సుఖం, సంపదలు దూరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
చేతులపై చిహ్నాలు:
కాకులు, గుడ్లగూబలు, పాములు, తోడేళ్ళ చిహ్నాలు చేతులపై ఉన్న స్త్రీలు ఇతరులకు కీడు తలపెడతారని చాణక్య నీతిలో ఉంది.
చెవులపై వెంట్రుకలు, భిన్న ఆకారం ఉన్న చెవులు:
చెవులపై వెంట్రుకలు లేదా భిన్న ఆకారంలో ఉన్న చెవులు కలిగిన స్త్రీలు ఇంట్లో కలహాలకు కారణం అవుతారని చాణక్యుడు పేర్కొన్నారు.
దంతాలు:
పొడవాటి, బయటకు పొడుచుకు వచ్చినట్లున్న దంతాలు ఉన్న స్త్రీలకు జీవితంలో ఎప్పుడూ దుఃఖమే ఎదురవుతుందని చాణక్య నీతి చెబుతుంది.
గమనిక: చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలను నేటి కాలానికి అన్వయించుకోవడం సరైంది కాదని గుర్తుంచుకోవాలి. ఇవి కేవలం ఆనాటి సాంఘిక పరిస్థితులు, నమ్మకాలకు అద్దం పడతాయి. ఆధునిక దృక్పథంలో వీటిని పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ ఆర్టికల్‌లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. ఏ వ్యక్తి స్వభావాన్నీ కేవలం ఇలాంటి శారీరక లక్షణాల ద్వారా నిర్ధారించలేము.




