తిరుమల కొండపై విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. న్యూఇయర్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూకడుతున్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భక్తుల ఎగబడుతున్నారు. క్యూలైన్లలోకి వెళ్లేందుకు భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర పెద్దసంఖ్యలో చేరుకున్నారు భక్తులు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇచ్చే టిక్కెట్ల కోసం ఇప్పటికే భారీగా క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం క్యూలైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, టికెట్ల జారీపై సరైన సమాచారం లేకపోవడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తోపులాట చోటు చేసుకుంది.
10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్న నేపథ్యంలో.. తిరుపతిలో 9 చోట్ల 92 కౌంటర్లను ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. నాలుగున్న లక్షల టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ టోకెన్లను ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, భక్తులు ఒక రోజు ముందుగానే కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. దాంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..