Hanuman Birth Place: అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. త్వరలోనే..

|

Jul 31, 2021 | 10:35 PM

Hanuman Birth Place: ఆంజనేయుడు జన్మస్థలం వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. అంజనాద్రే ఆంజనేయుడి..

Hanuman Birth Place: అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. త్వరలోనే..
Hanuman
Follow us on

Hanuman Birth Place: ఆంజనేయుడు జన్మస్థలం వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని తేల్చి చెప్పింది. పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని పండిత పరిషత్ నిర్ధారించిందని టీటీడీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన గ్రంథాన్ని త్వరలోనే ప్రచురిస్తామని టీటీడీ ప్రకటించింది.

హనుమంతుని జన్మ స్థలంపై పండిత పరిషత్ పరిశోధనలు ప్రపంచానికి తెలియజేయడానికి వెబినార్ నిర్వహించిన టీటీడీ హనుమాన్ బర్త్ ప్లేస్ పై మరింత క్లారిటీ ఇచ్చింది. తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండ్రోజుల అంత‌ర్జాతీయ వెబినార్‌ నిర్వహించి అంజనాద్రే ఆంజినేయుడి జన్మస్థలంగా పేర్కొంది. స్వామీజీలు, పండితులు.
తిరుమలగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హ‌నుమంతుడి జన్మస్థలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ప్రకటించింది.

ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర్ శర్మ, ఎస్.వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీషణ శర్మతో పాటు పండిత పరిషత్ సభ్యులు ఆచార్య రాణి సదాశివమూర్తి వెబినార్‌లో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలంగా ఉందని కుర్తాళం శ్రీ సిద్దేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారన్నారు.
ఇందులో ఎలాంటి సందేహం, వివాదం అవసరమే లేదని, శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హతే లేదని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి అభిప్రాయపడినట్లు చెప్పారు. 2007లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముద్రించిన హనుమాన్స్ కేమ్ పుస్తకంలో కూడా ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రే నని పేర్కొన్నారని వెబినార్ లో పాల్గొన్న మహేంద్ర వర్సిటీ లా కాలేజీ డీన్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలంగా స్వామీజీలు, పండితులు ముక్త కంఠంతో ఏకీభవించారని చెప్పారని, దీనికి సంబంధించి త్వరలోనే ఒక గ్రంథాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

రామజన్మ భూమి ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాక హనుమంతుడి జన్మ స్థలం నిర్ధారించాలని చాలా మంది భక్తులు టీటీడీ ఈఓ ను కోరారన్నారు. అందుకే పండిత పరిషత్ ను ఏర్పాటు చేశారని, హనుమంతుని జన్మ స్థలం పై పండిత పరిషత్ పరిశోధనలు ప్రపంచానికి తెలియజేయడానికి ఇంటర్నేషనల్ వెబినార్ నిర్వహించామన్నారు రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర్ శర్మ.

ఇక తిరుమలగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హ‌నుమంతుడి జన్మస్థలమని వెబినార్‌లో ముక్త కంఠంతో పాల్గొన్న వారంతా అంగీకరించారన్నారు టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి. వెబినార్‌లో పండితులు, స్వామీజీలు ఆంజినేయుడి జన్మస్థలం అంజనాద్రే నని ఆధారాలతో చెప్పారన్నారు. అంజనాద్రే ఆంజినేయుడి జన్మస్థలంగా నిర్ధారించామన్నారు. మూర్ఖంగా ఇప్పటికీ చెప్పడం లేదని, ఎవరైనా బలమైన ఆధారాలు తీసుకొస్తే భక్తులకు ఆంజినేయుడి జన్మస్థలంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హనుమంతుడి జన్మస్థలం ఆధారాలతో అంజనాద్రే నని త్వరలోనే టీటీడీ గ్రంధాన్ని తీసుకురాబోతుందనిచ మరొకరి ప్రకటన అవసరం లేదన్నారు ధర్మారెడ్డి.

Also read:

Shilpa Shetty Defamation Suit: శిల్పా శెట్టికి ఊరట.. ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు..

Baal Aadhaar card: మీ పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయలేదా? అయితే అసలుకే మోసం రావొచ్చు..

Andhra Pradesh: రామప్పకు యునెస్కో గుర్తింపు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్..!