Black Bangles: బ్లాక్ కలర్ గాజులు వేసుకుంటే జరిగేది ఇదే!
హిందూ మతంలో నలుపు రంగు ఎక్కువగా ఉపయోగించరు. నలుపు రంగును కీడు రంగుగా భావిస్తారు. అందులోనూ శుభ కార్యక్రమాలకు అయితే అస్సలు వాడరు. ఎందుకంటే నలుపు రంగును వాడటం వల్ల చెడు దృష్టి పడుతుందని విశ్వాసం. పెళ్లైన ఆడువారు అస్సలు వాడరు. గాజులు కానీ, చీరలు కానీ పెద్దగా ధరించరు. ఇంకొంత మంది అయితే నల్ల గాజులు వేసుకోకూడదని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆడవారు కేవలం తమ..

హిందూ మతంలో నలుపు రంగు ఎక్కువగా ఉపయోగించరు. నలుపు రంగును కీడు రంగుగా భావిస్తారు. అందులోనూ శుభ కార్యక్రమాలకు అయితే అస్సలు వాడరు. ఎందుకంటే నలుపు రంగును వాడటం వల్ల చెడు దృష్టి పడుతుందని విశ్వాసం. పెళ్లైన ఆడువారు అస్సలు వాడరు. గాజులు కానీ, చీరలు కానీ పెద్దగా ధరించరు. ఇంకొంత మంది అయితే నల్ల గాజులు వేసుకోకూడదని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆడవారు కేవలం తమ అందానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో నలుగు రంగు బట్టలు, గాజులు అన్నీ ధరిస్తున్నారు. మరి నలుపు రంగు గాజులు ఎందుకు వేసుకోకూడదు? వేసుకుంటే ఎలాంటి ఏమౌతుంది? ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల గాజులను ఎందుకు వేసుకుంటారు:
చాలా చోట్ల చాలా మంది పెళ్లి అయిన నవ వధువులను కూడా వేసుకుంటారు. ఎందుకంటే ఈ రంగు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇది నెగిటివిటీని తొలగిస్తుందని జ్యోతిష్యులు చెబుతారు. అందుకే చాలా చోట్లు నవ వధువులు నల్ల గాజులను వేసుకుంటుంటారు.
వైవాహిక జీవితంలో సంతోషం కోసం:
చాలా చోట్ల పెళ్లైన తర్వాత నవ వధువులు ఎరుపు గాజులతో నల్ల గాజులను ఆడవాళ్లు వేసుకుంటుంటారు. దీని వల్ల మహిళల దాంపత్య జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. అలాగే మహిళలు తమ చేతుల్లో నల్ల గాజులను వేసుకుంటే అది వారి భర్తను చెడు కన్ను నుంచి కాపాడుతుంది. భర్తను సురక్షితంగా ఉంచుతుందని నమ్ముతారు.
ఆర్థిక పరిస్థితి బలోపేతం:
బ్లాక్ కలర్ గాజులు వేసుకోవడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే భర్త ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగు పరుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పెళ్లైన నూతన వధువు.. ఆరు నెలల పాటు నల్ల గాజులు వేసుకుంటే.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తకుండా ఉంటాయి. వారి బంధం కూడా బల పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ఆచారం తెలుగు రాష్ట్రాల్లో కంటే.. ఉత్తర భారత దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది.
బ్లాక్ గాజులు:
అయితే కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రం నలుపు రంగు అశుభమని నమ్ముతారు. అందులోనూ ఆడవాళ్లు అస్సలు వేసుకోకూడదని అంటారు. పెళ్లైన ఆడవాళ్లు కొన్ని రోజుల పాటు ఎరుపు, గ్రీన్ కలర్ గాజులు తెప్పించి.. నల్ల గాజులను అస్సలు వేసుకోకూడదు. నలుపు రంగు ఆడవారికి అస్సలు మంచిది కాదని చెబుతూ ఉంటారు.








