Zodiac Signs : ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అయితే మనిషి కష్ట కాలంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే దానిని బట్టి అతడి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. సంక్షోభ సమయాల్లో కొంతమంది పేలవంగా ఆలోచించి అనార్థాలను కొని తెచ్చుకుంటారు. మరికొందరు ధృడంగా ఉండి భావోద్వేగాలను నియంత్రించుకుంటారు. మానసికంగా బలంగా ఉండే వ్యక్తులు వారి లోపాలను అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. పరిపక్వత స్థాయిని కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు ఆచరణాత్మకంగా ఉంటారు. ఈ ఐదు రాశుల వారు మానసింకంగా బలంగా ఉంటారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. మేషం
ఈ రాశివారు మానసికంగా ధృడంగా ఉంటారు. సమస్యకు బయపడకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఓటమిని ఎప్పుడు అంగీకరించరు.
2. వృషభం
ఈ రాశివారు నమ్మకమైన వారితోనే స్నేహం చేస్తారు. సమస్యలను సులభంగా అంగీకరించరు. కానీ తప్పదు అనుకుంటే దానికి పరిష్కారం కనుక్కునే వరకు శ్రమిస్తారు. ఎటువంటి పరిస్థితిలోనైనా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటారు.
3. కన్య
కన్య రాశి ప్రజలు సమస్యలను ఒంటరిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అపారమైన భావోద్వేగ శక్తిని కలిగి ఉంటారు. గాబరా పడకుండా ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోగలరు.
4. ధనుస్సు
ఈ రాశి ప్రజలు ఎల్లప్పుడూ తమ భావాలు, ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వారి నిర్ణయం మేరకు అందరు నడుచుకోవాలని ఆదేశిస్తారు. అత్యవసర పరిస్థితులను కూడా హాండిల్ చేస్తారు. వారికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు మాత్రమే అసలు విషయాలను తెలియజేస్తారు.
5. మిధునం
ఈ రాశివారు మానసికంగా బలంగా ఉంటారు. ప్రతికూల వాతావరణంలో కూడా నెట్టుకొస్తారు. ఎటువంటి భయాందోళనకు గురికాకుండా అందరికి ధైర్యం కల్పిస్తారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.
ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..! అయితే వడ్డీ రేట్లను తగ్గించారు.. ఎందుకో తెలుసుకోండి..
హిజ్ బుల్ ముజాహిదీన్ ఫౌండర్ సయ్యద్ సలాఉద్దీన్ కొడుకులు ‘స్యుడో టెర్రరిస్టులే’ ! ప్రభుత్వ వర్గాలు