Zoadiac Signs: ఈ రాశులవారికి పెళ్లంటే ఇష్టముండదు.. మీరందులో ఉన్నారేమో!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Sep 01, 2021 | 1:35 PM

ఏ వయసులో తీరాల్సిన ముచ్చట.. ఆ వయసులో తీరాలంటారు పెద్దలు. పెళ్లి కూడా అంతే. కొంతమంది 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలని భావిస్తే..

Zoadiac Signs: ఈ రాశులవారికి పెళ్లంటే ఇష్టముండదు.. మీరందులో ఉన్నారేమో!
Zodiac Signs

ఏ వయసులో తీరాల్సిన ముచ్చట.. ఆ వయసులో తీరాలంటారు పెద్దలు. పెళ్లి కూడా అంతే. కొంతమంది 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. మరికొందరు 30 ఏళ్లు దాటితేనే గానీ పెళ్లి చేసుకోరు. ఇలా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారివి. పెళ్లి నిర్ణయం అనేది వ్యక్తిగత ఆలోచన, ఆర్ధిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇక కొంతమంది అయితే పెళ్లికి పూర్తి విముఖత చూపిస్తారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారికి వివాహంపై అనేక అనుమానాలు ఉంటాయి. తమ జీవితాన్ని వేరే వ్యక్తితో పంచుకోవాడాన్ని అస్సలు ఇష్టపడరు. జోతిష్యశాస్త్రం ప్రకారం, నాలుగు రాశులవారు ఇలాంటి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. వారు వివాహంపై పూర్తిగా విముఖత చూపిస్తారు. ఆ రాశులు ఏంటో చూసేద్దాం పదండి..

కన్య:

ఈ రాశివారు ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదొకటి సాధించాలనే తపనతో ముందుకు వెళ్తుంటారు. అన్ని కూడా పర్ఫెక్ట్‌గా పూర్తి చేస్తారు. తమ లక్ష్యాలను చేరుకోవడంలో వివాహం అడ్డుగా నిలుస్తుందని అనుకునే వీరిలో పెళ్లి అంటేనే చాలు విముఖత చూపిస్తారు.

వృశ్చికం:

ఈ రాశివారు తమ మనసులోని మాటను బహిర్గతం చేయలేరు. అలాగే పెళ్లి చేసుకుంటే.. తమ మనసులోని భావాలను జీవిత భాగస్వామికి సరిగ్గా వ్యక్తపరచాలేమని వారు అనుకుంటారు. అందుకే పెళ్లికి విముఖత చూపిస్తారు.

ధనుస్సు:

ఈ రాశివారు స్వేఛ్చను కోరుకుంటారు. తమ జీవితంలో ఎలప్పుడూ ప్రతికూలతను, మెలో డ్రామాలకు చోటు లేకుండా చూసుకుంటారు. వీరు పెళ్లి ఎన్నో బాధ్యతలను, సమస్యలను తీసుకొస్తుందని నమ్ముతారు. అందుకే వివాహం చేసుకోవడానికి భయపడతారు.

మీనం:

ఈ రాశివారు ఎంతో ప్రత్యేకమైనవారు. ఎక్కువగా ఎవరితోనూ కలవరు. అంతేకాకుండా వివాహంపై ఆసక్తిని చూపించరు. తమకు వచ్చే జీవిత భాగస్వామి.. తమ వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను అర్ధం చేసుకోలేదని వారి భావన.

ఇవి చదవండి:

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu