వైభ‌వంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు షురూ..

|

May 22, 2024 | 9:55 PM

అనంతరం రాత్రి అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆల‌య అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శేష‌గిరి, భ‌క్తులు పాల్గొన్నారు.

వైభ‌వంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు షురూ..
Padmavati
Follow us on

తిరుమలలో, తిరుపతి, తిరుచానూరులో వైభంగా పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ‌వారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లి స్నపన తిరుమంజనం నిర్వహించారు.

పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆల‌య అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శేష‌గిరి, భ‌క్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..