AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jathara: మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ సర్కార్.. జాతర తేదీలు ఎప్పుడంటే..

తెలంగాణాలో జరిగే అతి పెద్ద అడవి బిడ్డల జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహా జాతర కోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏర్పాటు షురూ చేసింది. తెలంగాణ కుంభమేళా కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు చేసింది. వచ్చే సంవత్సరం 2026 జనవరి 28వ తేదీన మేడారం జాతర ప్రారంభం కానుంది.

Medaram Jathara: మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ సర్కార్.. జాతర తేదీలు ఎప్పుడంటే..
Medaram Jatara
Surya Kala
|

Updated on: Aug 20, 2025 | 4:18 PM

Share

ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతర..మేడారం జాతర. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే అడవి బిడ్డల పండగ వచ్చే ఏడాది జరుపుకోనున్నారు. ఇప్పటికే సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవ వేడుకల తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మేడారం మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. ఈ జాతర కోసం 150 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గిరిజన సంక్షేమ శాఖ.

వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహా జాతర నిర్వహణ, మేడారం లో శాశ్వత నిర్మాణాల పనుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహా జాతర ను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసిందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు చెప్పారు.

ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ గిరిజన పండగ వచ్చే సంవత్సరం 2026 జనవరి 28వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 28వ తేదీ బుధవారం సారలమ్మ గద్దెకు చేరుకోగా.. మర్నాడు అంటే 29వ తేదీ గురువారం సమ్మక్క గద్దెల మీదకు చేరుకుంటారు. 30వ తేదీ శుక్రవారం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చేల్లిమ్చుకోవచ్చు. 31వ తేదీ శనివారం.. సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్దరాజు లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..