AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: భక్తులు ఇచ్చిన 1,000 కేజీల బంగారాన్ని కరిగించిన స్టాలిన్ ప్రభుత్వం.. ఇప్పుడు వెండి కరిగించడానికి అనుమతి.. ఎందుకంటే

తమిళనాడులో ఎన్నో పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 33,000 అత్యంత పురాతన దేవాలయాలు ఉన్నాయి. కనుక ఈ రాష్ట్రాన్ని దేవాలయాల రాష్ట్రంగా పిలుస్తారు. ప్రసిద్ధి చెందిన ఆలయాలను దర్శించుకునేందుకు దేశ విదేశాలనుంచి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. భూరి నగదు, నగలు వంటి విలువైన వాటిని తమకు ఇష్టమైన దేవుళ్ళకు కానుకలుగా సమర్పిస్తారు. అలా దేవాలయాలకు భక్తులు సమర్పించిన బంగారాన్ని ప్రభుత్వం కరిగించింది.

Tamilnadu: భక్తులు ఇచ్చిన 1,000 కేజీల బంగారాన్ని కరిగించిన స్టాలిన్ ప్రభుత్వం.. ఇప్పుడు వెండి కరిగించడానికి అనుమతి.. ఎందుకంటే
Tamil Nadu Temples
Surya Kala
|

Updated on: Apr 18, 2025 | 12:08 PM

Share

తమిళనాడులో అడుగడుగునా గుడి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రసిద్ది చెందిన దేవాలయాలున్నాయి. అయితే కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్దిగంచాయి. ఈ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. స్వామివారికి తమ శక్తికొలదీ బంగారు, వెండి వంటి విలువైన వస్తువులతో పాటు నగదుని కూడా సమర్పిస్తారు. ఇలా భక్తులు సమర్పించిన బంగారు వస్తువుల నుంచి డబ్బు సంపాదించడం ప్రారంభించింది తమిళనాడు సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం 21 దేవాలయాలలో సుమారు 1,000 కిలోల ఉపయోగించని బంగారాన్ని కరిగించి 24 క్యారెట్ల బంగారు కడ్డీలుగా మార్చింది. ఈ కడ్డీలను బంగారు పెట్టుబడి పథకం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసింది. గురువారం ప్రభుత్వం నివేదిక ప్రకారం దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని కద్దీలుగా మార్చి బ్యాంక్ లో జమ చేసి సంవత్సరానికి రూ.17.81 కోట్ల వడ్డీని ఆర్జించింది.

ముంబైలోని ప్రభుత్వ టంకశాలలో బంగారాన్ని కరిగించారు. బంగారాన్ని బ్యాంక్ లో జమ చేయడం వలన వచ్చే వడ్డీని దేవాలయాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఈ సమాచారాన్ని హిందూ ధార్మిక ధార్మిక దేవాదాయ శాఖ (HR&CE) మంత్రి PK శేఖర్ బాబు తమిళనాడు అసెంబ్లీలో పాలసీ నోట్ ద్వారా పంచుకున్నారు.

వివిధ దేవాలయాల నుంచి సేకరించిన బంగారు కడ్డీల పెట్టుబడి వివరాలను నోట్‌లో పొందుపరిచారు. మార్చి 31, 2025 నాటికి, 21 దేవాలయాల నుంచి మేలిమి బంగారం 10,74,123.488 గ్రాములు సేకరించినట్లు చెప్పారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్న సమయపురంలోని అరుళ్మిగు మరియమ్మన్ ఆలయం నుంచి అత్యధికంగా బంగారం విరాళం వచ్చింది. ఈ ఆలయం పెట్టుబడి పథకానికి నిరుపయోగంగా ఉన్న దాదాపు 424.26 కిలోల బంగారాన్ని ఇచ్చిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ పథకం సక్రమంగా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవడానికి.. ప్రభుత్వం మూడు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి కమిటీకి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. బంగారం పెట్టుబడి ప్రక్రియను తనిఖీ చేయడం, పర్యవేక్షించడం వీరి బాధ్యత.

అయితే ఈ పథకాన్ని కొంతకాలం నిలిపివేసినట్లు న్యూస్ పోర్టల్ DT Nex నివేదించింది. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 2021-2022లో మాత్రమే పునరుద్ధరించబడిందని పేర్కొన్నారు.

బంగారం తర్వాత.. ఇప్పుడు ప్రభుత్వం దేవాలయాలలో ఉపయోగించని.. ఉపయోగించలేని వెండి వస్తువులను కరిగించడానికి ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం దేవాలయాలలో ఉపయోగించని వెండి వస్తువులను కరిగించడానికి ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు” అని పేర్కొంది.

ఈ వస్తువులను ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేట్ కంపెనీలు స్వచ్ఛమైన వెండి కడ్డీలుగా మారుస్తాయి. వెండి కరిగించడం ఆలయ స్థలాలలో, ముగ్గురు న్యాయమూర్తుల నేతృత్వంలోని జోనల్ కమిటీల పర్యవేక్షణలో జరుగుతుంది. వెండిని కరిగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..