తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు కొదవే లేదు. ఎన్నో వేల ఏళ్లనాటి, అత్యంత పురాతన ఆలయాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇక వీటిలో ఇప్పటికీ ఎవరూ కనిపెట్టని రహస్యాలతో కూడిన ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో బృహదీశ్వరాలయం ఒకటి. ఈ పురాతన శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. అందుకే.. దీనిని ఒక్కసారైనా తప్పక సందర్శించాలని అంటారు. ఇంతకీ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఆలయంలో రహస్యం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శివాలయం అయిన ఈ బృహదీశ్వరాలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ 1 కాలంలో నిర్మించారుర. బృహదీశ్వర ఆలయంలో చోళ రాజవంశం శిల్పకళా వైభవం ఉట్టిపడుతుంది. ఈ ఆలయ నిర్మాణంలో అధునాతన ఇంజనీరింగ్ సాంకేతికతతో సహా అనేక అంశాలు ఉన్నాయి. ఇది నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కారణం.. ఈ ఆలయం నీడ కనిపించకపోవడం. అవును, మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ కనిపించదు. నీడ కింద పడదు. అదే ఈ ఆలయం ప్రత్యేకత.
మధ్యాహ్నం సమయంలో గుడి నీడ కనిపించదు. ప్రకృతి మర్మమా? ఆనాటి నిపుణుల ల్యాటెంటో తెలియదు కానీ, ఈ రహస్యం ఇప్పటి వరకు తేలలేదు. ఇక ఇది ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాల్లో ఒకటి. అయినప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఆలయం నీడ నేలపై పడదు. ఏడాదిలో ఏ సమయంలోనైనా మధ్యాహ్నం సమయంలో నీడ నేలపై పడని విధంగా డిజైన్ చేశారు.
అయితే, నాడు ఆలయ నిర్మాణం పూర్తి కాగానే.. రాజరాజ చోళులు ఈ ఆలయం ఎప్పుడైనా కూలిపోతుందా? అని శిల్పిని ప్రశ్నించగా.. కనీసం నీడ కూడా పడదని బదులిచ్చాడట. ఈ వింతను స్వయంగా చూసి రాజు.. శిల్పిని ప్రశంసలతో ముంచెత్తారట.
బృహదీశ్వర ఆలయం.. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు దక్కించుకుంది. ఈ బృహదీశ్వర ఆలయాన్ని 11వ శతాబ్దంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంది. ఆలయ సముదాయంలో ఎత్తైన గోపురాలు, భారీ బురుజులతో సహా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇందులో శివుడు, పార్వతి, గణేషుడు, కార్తీకేయ దేవాలయాలు ఉన్నాయి.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..