Dream Science: కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా.. స్వప్న శాస్త్రం ఏం చెబుతోందంటే

|

Jan 09, 2025 | 3:21 PM

స్వప్న శాస్త్రంలో ప్రతి కలకి కొంత అర్థం ఉందని పేర్కొంది. దీని ప్రకారం కలలలో కనిపించే అన్ని విషయాలు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి సూచిస్తాయి. అదేవిధంగా ఎవరికైనా తమ పూర్వీకులు కలలో కనిపిస్తే.. అప్పుడు ఆనందం చెప్పనలవి కాదు. అయితే పూర్వీకులు కలలలో కనిపించడానికి వెనుక కూడా అర్ధం ఉందని స్వప్న శాస్త్రంలో పేర్కొంది. ఈ నేపధ్యంలో ఈ రోజు కలలో పూర్వీకులను చూడటం శుభమో, అశుభమో తెలుసుకుందాం.

Dream Science: కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా.. స్వప్న శాస్త్రం ఏం చెబుతోందంటే
Dream
Follow us on

పూర్వీకులు ఎప్పుడూ కోపంగా ఉండకూడదని హిందూ మత గ్రంధాలలో చెప్పబడింది. నమ్మకాల ప్రకారం పూర్వీకులు సంతోషంగా ఉంటేనే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆనందం నెలకొంటుంది. పూర్వీకులను సంతోషంగా ఉంచడం ద్వారా వారి అనుగ్రహంతో పాటు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. పూర్వీకులు కోపగించుకుంటే ఇంట్లో సంతోషం లోపిస్తుంది. దేవతల అనుగ్రహం కూడా ఉండదు అని నమ్మకం. అయితే పూర్వీకులు ఏడాది పొడవునా ఏదో ఒక విధంగా తమ సంతోషాన్ని లేదా అసంతృప్తిని రకరకాల సంకేతాల ద్వారా తెలియజేస్తూనే ఉంటారు. ఇందులో కలలు కూడా ముఖ్యమైనవి. చాలా మంది తమ పూర్వీకులను కలలో చూస్తారు. వాస్తవానికి.. ఇలా పెద్దవారు కలలో కనిపిస్తే.. కొన్ని సంకేతాలు ఇస్తున్నాట్లు లెక్క. ఈ రోజు మనం కలలో పూర్వీకులు కనిపిస్తే.. మీ పూర్వీకులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా లేదా కోపంగా ఉన్నారా అని తెలుస్తుంది.

ఈ కలల ద్వారా శుభ సంకేతాలను ఇచ్చే పూర్వీకులు

  1. పూర్వీకులు స్వీట్లు పంచుతున్నట్లు లేదా కలలో ఏదైనా ఇస్తున్నట్లు కనిపిస్తే అది శుభసూచకమని స్వప్న గ్రంథం చెబుతోంది. మీరు పూర్వీకులకు ఇచ్చిన శ్రాద్ధ కర్మలకు, తర్పణంతో చాలా సంతోషంగా ఉన్నట్లు.. సంతృప్తి చెందారని అర్థం. అలాగే, త్వరలో మీ ఇంటిలో సంతోషకరమైన వార్త వింటారని అర్ధం.
  2. కలలో పూర్వీకులు మాట్లాడుతున్నట్లు కనిపించినా ఆ కలలు శుభ సంకేతంగా పరిగణించబడుతున్నాయి. పూర్వీకులు కలలో మాట్లాడటం కనిపిస్తే సమీప భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించవచ్చని అర్థం.
  3. కలలలో పూర్వీకులకు ఆహారం అందిస్తున్నట్లు కనిపిస్తే.. స్వప్న శాస్త్రంలో శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మీకు అలాంటి కల కనిపిస్తే రాబోయే కాలం చాలా బాగుంటుందని అర్థం.

ఏ కలలు అశుభ సంకేతాలంటే

  1. కలలో పూర్వీకులు కనిపించినట్లు కనిపించి వెంటనే అదృశ్యం అయితే అది అశుభం. అటువంటి కలను చూడటం అంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం. అటువంటి పరిస్థితిలో మీ ఇంటి కుల దైవాన్ని పూజించాలి.
  2. ఇవి కూడా చదవండి
  3. పూర్వీకులు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తే.. అటువంటి కలలు చాలా అశుభం. మీరు అలాంటి కలని చూసినట్లయితే.. మీకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని కోల్పోయే అవకాశం ఉందని అర్థం.
  4. కలలో పూర్వీకులు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తే.. పూర్వీకులు మీరు చేసిన పనులతో సంతోషంగా లేరని అర్థం. ఇంట్లో పృథ దోషం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.