ఈరోజు సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? చేయవలసినవి, చేయకూడని ఏమిటంటే

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజున, పూర్వీకులను పూజించడం ఆచారం. అయితే అన్ని అమావాస్యల కంటే బాద్రప్రద మాసంలో వచ్చే అమావాస్య రోజుకి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజున మహా ఆలయ అమవస్యగా జరుపుకుంటారు. అంతేకాదు ఈ రోజున ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ రోజున ఏర్పడే సూర్యగ్రహణం (సూర్య గ్రహణం 2025) గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

ఈరోజు సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? చేయవలసినవి, చేయకూడని ఏమిటంటే
Surya Grahan 2025
Image Credit source: social media

Updated on: Sep 21, 2025 | 7:33 AM

వేద క్యాలెండర్ ప్రకారం ఈ రోజు భాద్రప్రద మాసం అమావాస్య తిథి. ఈ రోజుని మహాలయ అమావస్యగా జరుపుకుంటారు. ఈ రోజు పూర్వీకులకు తర్పణం (నైవేద్యం), శ్రార్ధ కర్మలను, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలను చేస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం అమావాస్య రోజున ఈ ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకులు సంతోషపడతారు. పితృ దోష సమస్య తొలగుతుంది. ఈ రోజున మరో విశిష్టత కూడా ఉంది.
ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం సర్వ పితృ అమావాస్య నాడు సంభవిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయడం, ఆహారం తినడం నిషేధించబడింది. గ్రహణం సమయంలో నియమాలను పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున సూర్యగ్రహణం సమయంలో చేయవలసినవి, చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం..

సూర్యగ్రహణం 2025 తేదీ, సమయం

భారతదేశంలో సూర్య గ్రహణం 2025 తేదీ , సమయం ప్రకారం.. సూర్యగ్రహణం ఈ రోజు ( సెప్టెంబర్ 21) రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై తెల్లవారు జామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. రాత్రి సమయంలో ఏర్పడే గ్రహణం కనుక మన దేశంలో గ్రహణం కనిపించదు.

సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయాలి

  1. సూతక కాలానికి ముందు ఇంట్లో పూజ గది తలుపులు మూసివేయండి.
  2. తినే ఆహారంలో తులసి దళాలను, దర్భలను చేర్చుకోవాలి.. ఆహారంలో తులసి ఆకులను జోడించడం వల్ల గ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చని నమ్ముతారు.
  3. ఇవి కూడా చదవండి
  4. సూర్యగ్రహణ సమయంలో దేవతలకు సంబంధించిన మంత్రాలను జపించండి.
  5. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయండి.
  6. పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసి, గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి.
  7. పూజ చేసిన తర్వాత, ఆహారం, డబ్బు మొదలైన వాటిని దానం చేయండి.
  8. సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు
  9. సూర్యగ్రహణం సమయంలో పూజలు నిషేధించబడ్డాయి . దేవుళ్ళ విగ్రహాలను తాకకూడదు.
  10. గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు.
  11. అంతేకాదు పదునైన వస్తువులను ఉపయోగించవద్దు.
  12. ఏ రకమైన శుభ కార్యాలను కూడా నిర్వహించరాదు. ఇలా చేయడం వల్ల శుభ కార్యాలకు తగిన ఫలితాలు లభించవు.
  13. ఆహారం తినకూడదు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు