Solar Eclipse: సూర్యగ్రహణం నుంచి ఈ మంత్రాన్ని పఠించండి.. ఆరోగ్యం, కెరీర్‌లో విజయం మీ సొంతం..
గ్రహణాలకు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణాలను చెడు సమయంగా భావిస్తారు. అందుకనే సూర్యగ్రహణం లేదా చంద్ర గ్రహణం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకుండా నిషిద్ధం ఉంది. అయితే గ్రహణ సమయంలో ఒక ప్రత్యేక మంత్రాన్ని జపించడం ద్వారా అనేక శుభ ఫలితాలను పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ నెలలో ఏర్పడనున్న సూర్యగ్రహణ సమయంలో పఠించవలసిన శక్తివంతమైన మంత్రం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకమైన సంఘటనగా పరిగణిస్తారు. 2025 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం మార్చి 29, 2025న సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం రోజున దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
అంతేకాదు ఈ రోజున మంత్రాలను జపించడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. సూర్యగ్రహణం రోజున సూర్యునికి సంబంధించిన ప్రాథమిక మంత్రాన్ని జపించాలి. హిందూ మత విశ్వాసం ప్రకారం, సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని జపించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ లక్ష్యాలను సాధించడంలో ఈ మంత్రాలు సహాయపడతాయి. ఈ సూర్య మంత్రాన్ని జపించడం వల్ల కెరీర్, వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు లభిస్తాయి.
సూర్య మూల మంత్రం
ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్యాయ నమః
ఇది సూర్యుడికి సంబంధించిన ప్రాథమిక మంత్రం. సూర్యగ్రహణం రోజున మాత్రమే కాదు ఈ మంత్రాన్ని ఇతర రోజులలో కూడా జపించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. మీరు ఏదైనా ప్రత్యేక ప్రయోజనం కోసం సూర్య మూల మంత్రాన్ని జపిస్తుంటే.. ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించే ముందు స్నానం చేసి ధ్యానం చేయండి. తరువాత ఈ మంత్రాన్ని ఏదైనా ఏకాంత ప్రదేశంలో లేదా పూజా స్థలంలో లేదా ఆలయంలో కూర్చుని జపించాలి.
సూర్య మూల మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు
సూర్యగ్రహణం రోజున మీరు ఈ సూర్య మంత్రాన్ని జపిస్తే.. అది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడిని జ్ఞానానికి అధిష్టాన దైవంగా కూడా పరిగణిస్తారు. కనుక సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే.. అది జ్ఞానాన్ని తెలివి తేటలను పెంచుతుంది. అలాగే సూర్య మూల మంత్రాన్ని జపించడం వల్ల ఇంట్లో ఆనందం, కెరీర్‌లో విజయం, ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది. ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు నుంచి ప్రారంభించి.. ప్రతిరోజూ లేదా ప్రతి ఆదివారం జపించడం అత్యంత ఫలవంతం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు