
2025 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం ఒక ఖగోళ సంఘటన. ప్రజలు ఈ సంఘటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఉండనున్నాయి. వాటిలో 2 సూర్యగ్రహణాలు. 2 చంద్రగ్రహణాలు ఉంటాయి. కాగా ఇప్పటికే ఒక సూర్య గ్రహణం, ఒక చంద్ర గ్రహణం ఏర్పడ్డాయి. ఇక రెండు గ్రహణాలు ఈ ఏడాది లో ఏర్పడనున్నాయి. వాటిల్లో ఒకటి అయిన సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? మన దేశంలో ఈ సూర్యగ్రహణం ప్రభావం ఉండనుందా లేదా తెలుసుకుందాం..
సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సంఘటన కారణంగా, సూర్యుని ప్రతిబింబం కొంత సమయం పాటు చంద్రుని వెనుక కప్పబడి ఉంటుంది. ఈ సంఘటనను సూర్యగ్రహణం అంటారు. కానీ సూర్యగ్రహణం సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచించారు.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. గ్రహణం సమయంలో కొన్నిసార్లు చంద్రుడు సూర్యునికి, భూమికి మధ్య వస్తాడు, దీని కారణంగా సూర్యకాంతి భూమిపై పడదు. లేదా చంద్రుడు సూర్యుడి కాంతి భూమి మీద పడకుండా అడ్డుకుంటాడు. ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు. ఈ ఖగోళ దృగ్విషయం ఎల్లప్పుడూ అమావాస్య రోజున సంభవిస్తుంది.
భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3.24 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం 4.24 నిమిషాలు ఉంటుంది. సెప్టెంబర్ 21న జరిగే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అవుతుంది.
2025 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. ఈ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం న్యూజిలాండ్, ఫిజి, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాలలో కనిపిస్తుంది. సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూర్య గ్రహణ సమయంలో సుతక కాలం భారతదేశంలో వర్తించదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.