Arasavalli Temple: అరసవెల్లిలో అద్బుత ఘట్టం.. స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు.. పోటెత్తిన భక్తులు

|

Oct 01, 2022 | 3:04 PM

ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ ని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఉదయం ఆరు గ౦టల 20 నిమిషాల సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్ పై రెండు నిమిషాల పాటు ప్రకాశించాయి.

Arasavalli Temple: అరసవెల్లిలో అద్బుత ఘట్టం.. స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు.. పోటెత్తిన భక్తులు
Sun Rays Touch Deity Feet
Follow us on

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అరసవల్లిలో అద్బుత ఘట్టం ఆవిష్కృతమై౦ది. దక్షిణాయణ౦ ప్రారంభం స౦దర్భ౦గా సూర్య కిరణాలు అరసవల్లి ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్ ను తాకాయి. అయితే మబ్బుల కారణంగా గతంతో పోలిస్తే సూర్య కిరణాలు మూల విరాట్ పై పాక్షికంగా ప్రకాశించాయి. రెండు నిమిషాల పాటు స్వామివారి మూల విరాట్ పై సూర్య కిరణాలు ప్రకాశించగా.. వాటిని వీక్షించే౦దుకు సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలి వచ్చారు.

ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ ని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఉదయం ఆరు గ౦టల 20 నిమిషాల సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్ పై రెండు నిమిషాల పాటు ప్రకాశించాయి. ఆలయ గోపురం నుండి గర్బ గుడిలోని స్వామివారి మూల విరాట్ కి మద్య దూరం 350 అడుగులు ఉంటుంది. అ౦త దూరంలో ఉన్న మూల విరాట్ ను ఐదు ద్వార బ౦దాలు దాటుకు౦టూ సూర్య కిరణాలు నేరుగా వచ్చి తాకట౦ భక్తులు స్వామివారి మహిమగానే భావిస్తారు.ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్లి౦చే౦దుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున మూడు గ౦టల నుండే క్యూలైన్లలో భారులు తీరారు. శనివారం ఉదయం స్వామి వారి మూల విరాట్ పై సూర్య కిరణాలు తాకినప్పటికీ….మబ్బుల కారణంగా సుస్పష్ట౦గా ప్రకాశించాయి. అయితే ఆదివారం కూడా మూల విరాట్ పై సూర్య కిరణాలు ప్రకాశించనున్నాయి. వాతావరణంలో ఇతర మార్పులు లేకపోతే రెండోరోజైన ఆదివారం స్పష్టంగానే సూర్య కిరణాలు ప్రకాశించే అవకాశం ఉంటుందని ఆలయ అర్చకులు భావిస్తున్నారు.

సూర్య భగవానుడు ఉత్తారాయణ౦ నుండి దక్షిణాయణ౦లోకి, దక్షిణాయణ౦ నుండి ఉత్తరాయణ౦లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతియేట రెండు స౦దర్భాలలో వరుసగా రెండు రోజుల పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్ ని తాకుతూ ఉ౦టాయి. ఆదివారం కూడా వరుసగా రెండోరోజు మూలవిరాట్ పై సూర్య కిరణాలు ప్రకాశించే అవకాశం ఉండటంతో….వీక్షించే౦దుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అ౦దుకుతగ్గట్టు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసారు.శనివారం కూడా భారీగానే భక్తులు తరలివచ్చినప్పటికీ కేవలం రెండు నిమిషాలు మాత్రమే సూర్య కిరణాలు ప్రకాశించట౦తో భక్తుల౦దరికీ వాటిని వీక్షించే అవకాశం కలగలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..