Statue of Equality: ముచ్చింతల్ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది(Ramanujacharya Sahasrabdi) సమారోహ వేడుకలతో, ముచ్చింతల్ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బుధవారం జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు నిర్వహించిన శోభాయాత్రతో ప్రారంభమైన ఉత్సవాలకు, అంకురార్పణ చేశారు చినజీయర్ స్వామి. ఈ అంకురార్పణ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్. సమతామూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy)నేతృత్వంలో ఈ యాత్ర సాగింది. యాగశాల దగ్గర వాస్తుశాంతి హోమం నిర్వహించారు. 12 రోజుల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా వాస్తుశాంతి హోమం జరుపుతారు.
రెండవ రోజు వేడుకలు..
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన కార్యక్రమం మొదలైంది. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్ని దేవుడి హోత్రంతో 1035 కుండాలను వెలిగించి హోమాలు ప్రారంభిస్తారు. ఇష్టిశాలల వద్ద దుష్ట నివారణకు శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్దికి శ్రీవాసుదేవేష్టి చేస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు జరుగుతాయి.
ఈ ఉదయం సరిగ్గా 9 గంటలకు నుంచి యాగశాలలో యజ్ఞం మొదలైంది. ఈ యజ్ఞం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు యాగశాలలో యజ్ఞం నిర్వహించనున్నారు. అనంతరం ఒంటి గంట వరకు పూర్ణాహుతి – ప్రసాద వితరణ కార్యక్రమం జరగనుంది.
ఇక సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు యాగశాలలో హోమం చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.. 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అతిథుల ప్రసంగాలు జరగనున్నాయి. అనంతరం రాత్రి 8 గంటల వరకు శ్రీరామానుజచార్య లైవ్ లేజర్ షో నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..
RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..