TTD: పెరటాసి మాసంలో తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఆ రోజున ఐదు లక్షల మంది వస్తారని అంచనా..

|

Sep 24, 2022 | 1:15 PM

తిరుమల (Tirumala) కొండపై బ్రహ్మోత్సవాల శోభ నెలకొంది. కోనేటి రాయుడి కమనీయ వేడుకకు తిరుగిరులు సిద్ధమయ్యాయి. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళుల..

TTD: పెరటాసి మాసంలో తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఆ రోజున ఐదు లక్షల మంది వస్తారని అంచనా..
Tirumala
Follow us on

తిరుమల (Tirumala) కొండపై బ్రహ్మోత్సవాల శోభ నెలకొంది. కోనేటి రాయుడి కమనీయ వేడుకకు తిరుగిరులు సిద్ధమయ్యాయి. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళుల పవిత్ర మాసం పెరటాసి మాసంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని టీటీడీ భావిస్తోంది. గరుడ సేవ రోజు ఐదు లక్షల మంది భక్తులు వచ్చే ఆవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు (Devotees) ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల రద్దీ కారణంగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల, తిరుపతిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి చెప్పారు. తిరుపతిలో ఉన్న అన్ని విభాగాలతో సమావేశం జరిపిన ఆయన.. భక్తులు గమ్య స్థానానికి చేరుకునేలా పోస్టర్లు నెలకొల్పామని తెలిపారు. నాలుగు మాడ వీధుల్లో భక్తులకు తలెత్తే ఇబ్బందుల ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు. అటువంటి ప్రదేశాల్లో తహశీల్దార్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని వివరించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం సిద్ధమైంది. కరోనా కారణంగా రెండేళ్లు ఉత్సవాలు జరగలేదు. దీంతో ప్రస్తుతం జరిగే బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబ‌రు 5వ వ‌రకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 26న రాత్రి 7 గంటలకు అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలు అక్టోబర్ 5 న వేదపండితులు నిర్వహించే చక్రస్నానంతో ముగుస్తాయి. అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్సవం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగుతాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనం మినహా మిగిలిన దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తామని వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని.. గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్ లైన్ లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయించే ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం