Video Viral: ప్రేమ ముందు పేదిరకమూ దిగదుడుపే.. హృదయాలను ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ వీడియో

పెళ్లి విషయంలో చాలా మంది అమ్మాయిలకు వివిధ విషయాల్లో చాలా సందేహాలు ఉంటాయి. తమ జీవితంలో భాగమయ్యేవాడు తనను అర్థం చేసుకుంటాడా.. తనను ప్రేమిస్తాడా.. కష్టం రాకుండా చూసుకుంటాడా..

Video Viral: ప్రేమ ముందు పేదిరకమూ దిగదుడుపే.. హృదయాలను ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ వీడియో
Family Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 24, 2022 | 6:39 AM

పెళ్లి విషయంలో చాలా మంది అమ్మాయిలకు వివిధ విషయాల్లో చాలా సందేహాలు ఉంటాయి. తమ జీవితంలో భాగమయ్యేవాడు తనను అర్థం చేసుకుంటాడా.. తనను ప్రేమిస్తాడా.. కష్టం రాకుండా చూసుకుంటాడా అని ఆలోచిస్త్తారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటేనే ఆ సంసార జీవితం చక్కగా నడుస్తుంది. మరోవైపు.. ప్రస్తుతం సోషల్ మీడియో వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రామ్, యూ ట్యూబ్ లో మునిగిపోతున్నారు. తమలోని ట్యాలెంట్ ను బయటకు తీసుకువచ్చే రీల్స్ పట్ల అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని చూడటమే కాకుండా రీల్స్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ ప్లేబ్యాక్ సింగర్ నేహా కక్కర్, రోహన్‌ప్రీత్ సింగ్ తమ గాత్రంతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. సోషల్ మీడియాలో ఎటు చూసినా వీరు పాడిన పాటలే వస్తున్నాయి. అభిమానులు వాటిని వినడమే కాకుండా ఆ పాటలపై రీల్స్, షార్ట్‌లు కూడా చేస్తున్నారు. వారి అభిమానులు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

ప్రస్తుతం బారిష్ మే తుమ్ పాట ఎంతగా హిట్ అయ్యిందంటే దానిపై రీల్స్, షార్ట్‌లు చేస్తున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ పాటకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి రోటీలు తయారు చేయడాన్ని చూడవచ్చు. ఇంతలో అతని భార్య వచ్చి అతన్ని ప్రేమగా కౌగిలించుకుని నవ్వుతుంది. ఈ వీడియో టిక్‌టాక్‌లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు భారీగా స్పందన వస్తోంది. లక్షలాది మంది చూసి లైక్ చేశారు. అంతే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..