SrivariBrahmotsavam: శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ – మస్కట్ గ్రేప్స్ – కొరియన్ పియర్స్

| Edited By: Ravi Kiran

Sep 29, 2022 | 11:32 AM

శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్, మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్ తిరుమలకు చేరుకున్నాయి. ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్, పండ్లు స్వామివారి సన్నధికి వచ్చాయి. దేశీయ తృణ ధాన్యాలు, పండ్లు, పూలు,..

SrivariBrahmotsavam: శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ – మస్కట్ గ్రేప్స్ – కొరియన్ పియర్స్
Snapana Tirumanjanam
Follow us on

శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్, మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్ తిరుమలకు చేరుకున్నాయి. ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్, పండ్లు స్వామివారి సన్నధికి వచ్చాయి. దేశీయ తృణ ధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో జపాన్ నుంచి యాపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి పియర్స్, థాయిలాండ్ నుంచి మామిడి, అమెరికా నుంచి చెర్రీస్ స్వామివారి సేవలో తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్ల లోని తమ స్వస్థలాల నుంచి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

తిరుమలేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం మలయప్ప స్వామి హంస వాహనంపై రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరుమాఢ వీదుల్లో విహరించారు. వీణ ధరించి, సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి వస్తున్నారు. హంసవాహన సేవలో శ్రీ వేంక‌టేశ్వర‌స్వామి జ్ఞానమూర్తిగా కనిపించాడు. హంస అంటే జ్ఞానానికి ప్రతీక. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని కలిగించేందుకు మలయప్ప స్వామి హంస వాహనంపై కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

Tirumala Brahmotsavalu

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి పట్టు వస్త్రాలు సమర్పించి, ఆ రాత్రికి తిరుమలలోనే బస చేశారు. ఆలయంలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌.. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం పరకామణి భవనం వద్దకు బయలు దేరారు. రూ.23 కోట్లు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..