ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున భక్తులకు వసతీ గదులను నిర్మించేందుకు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందు సిద్దంగా ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డి అన్నారు. శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని కోరుకున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అన్నారు
ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.
టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఈఓ ధర్మారెడ్డికి శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఈవో పెద్దిరాజు స్వామిఅమ్మవార్ల జ్ఞాపకను అందజేయగా అర్చకులు వేదపండితులు తీర్ధప్రసాదాలిచ్చి ఆశీర్వదించారు. శ్రీశైలం దేవస్థానంలో భక్తుల కోసం రెండు వందల రూములు నిర్మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నామని శ్రీశైలం దేవస్థానం తరుపున లెటర్ పంపిస్తే బోర్డు మీటింగ్ లో పెట్టి తీర్మానం చేస్తామని ఈఓ ధర్మారెడ్డి అన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..