Kampakalli: చెన్నకేశవ స్వామి తిరునాళ్లు పొంగళ్లతో ప్రారంభం.. కంపకళ్లిపై దొర్లిన బిడ్డకు ఎలాంటి రోగాలు రావని నమ్మకం..

|

May 07, 2023 | 1:00 PM

తిరునాళ్ల సంప్రదాయ ప్రకారం చక్క వారి వంశస్థులు పెట్టే పొంగళ్లతో మొదలవుతాయి. చివరి రోజు కంపకళ్లి అనే కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.

Kampakalli: చెన్నకేశవ స్వామి తిరునాళ్లు పొంగళ్లతో ప్రారంభం.. కంపకళ్లిపై దొర్లిన బిడ్డకు ఎలాంటి రోగాలు రావని నమ్మకం..
Kampakalli Fest In Prakasam
Follow us on

ప్రకాశం జిల్లాలో చిన్న గొల్లపల్లి తిరునాళ్లలో నిర్వహించే కంపకళ్లి కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. చిన్న గొల్లపల్లిలో చెన్నకేశవ స్వామి తిరునాళ్లు వైశాఖ శుద్ధ దశమి రోజు ప్రారంభమవుతాయి. తిరునాళ్ల సంప్రదాయ ప్రకారం చక్క వారి వంశస్థులు పెట్టే పొంగళ్లతో మొదలవుతాయి. చివరి రోజు కంపకళ్లి అనే కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.

కంపకళ్లి కార్యక్రమంలో చిన్నపిల్లలను ముళ్లకంపపై దొర్లించడం అక్కడి ఆచారం. తుమ్మ ముళ్ల కంపలు పెద్ద ఎత్తున పేర్చి.. సాయంకాలం సమయంలో పోతురాజులు ముళ్లకంప చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వేలాది మంది భక్తుల మధ్య చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ముళ్లకంపపై దొర్లుతూ రక్తం కారుతున్నా మొక్కు తీర్చుకుంటారు. కంపకళ్లి ఆచారాన్ని అడ్డుకోవాలని చూస్తున్న అధికారులు.. ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారు. కంపకళ్లిపై దొర్లిన బిడ్డకు ఎలాంటి రోగాలు దరి చేరవని భక్తుల అపార నమ్మకం. తరతరాలుగా ముళ్లకంపపై చిన్నారులను దొర్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

14 సంవత్సరాలలోపు పిల్లలను ముళ్లకంపపై దొర్లించరాదని, గతంలో మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. గత 5 సంవత్సరాల నుండి పోలీస్ అధికారులు పహారా కాస్తూ, శిశు సంక్షేమ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని.. చెప్తూనే భారీగా బలగాలను మోహరిస్తున్నారు. సైన్సు ఇంతగా అభివృద్ధి చెంది విశ్వ రహస్యాలను మానవుడు చేధిస్తున్న నేటి రోజుల్లో కూడా మూఢ నమ్మకాలు, విశ్వాసాలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..