Viral Video: భద్రకాళి అమ్మవారి అభిషేకం వీడియో వైరల్.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్
భద్రకాళీ అమ్మవారి ఆలయం ఉమ్మడి వరంగల్లు జిల్లాలో ఉంది. భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు కొలువై ఉంది.
Bhadra Kali Viral Video: భారత దేశం సనాతన హిందూ ధర్మానికి నెలవు. అనేక ఆధ్యాత్మిక దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే దైవం ఉందని.. నమ్మి.. దేవుళ్ళనే కాదు.. ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం. దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు.. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలను రుజువుగా చూపిస్తారు. ఇక గుడి నిర్మాణ శైలిలో కూడా అత్యాధునిక శాస్త్ర సాంకేతికతకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరించే ఆలయాలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా భద్రకాళి అమ్మవారు అభిషేకం సమయంలో కళ్ళు మూసుకుని… తెరచుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అభిషేక సమయంలో అమ్మవారు కళ్లు తెరుకోవడం.. మూయడం కనిపిస్తుంది. పూజారులు అమ్మవారికి జలాభిషేకం చేస్తూ.. తలమీద నుంచి నీరు పోస్తున్న సమయంలో ఆ తల్లి కళ్ళు తెరచి చూస్తుంది.. అయితే ఆ నీరు.. కనుల దగ్గరకు వచ్చే సరికి.. కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తోంది. అమ్మవారి లీల అంటూ భక్తులు ఈ వీడియో ని షేర్ చేస్తున్నారు. ఇదంతా అలనాటి శిల్పకళా నైపుణ్యం అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
How divine to witness Warangal Bhadrakali amman’s eyes opens & closes during Abhishekam.. Friday’s blessings ? pic.twitter.com/48hrRRgSw1
— Anu Satheesh ?? (@AnuSatheesh5) August 11, 2022
భద్రకాళీ అమ్మవారి ఆలయం ఉమ్మడి వరంగల్లు జిల్లాలో ఉంది. భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు కొలువై ఉంది. అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారు 8 చేతులతో భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకం ఉంటాయి. ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ఉంటాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనం ఇస్తుంది.
సా.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఉంది. దీనిని భద్రకాళి చెరువు అంటారు. వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా కూడా ఈ చెరువు నుండే జరుగుతుంది.
ఆశ్వయుజ మాసంలో దసరా శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆషాఢమాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని “శాకంభరి”గా అలంకరిస్తారు. రకరకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో అలంకరించి పూజిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..