Sravana Masam: శ్రావణ సోమవారం రోజున శివయ్య ఈ రూపాలను ఆరాధించండి.. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది

|

Aug 09, 2024 | 10:00 AM

శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా శివయ్య మాత్రమే కాదు పార్వతి దేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తుంది.మరియు జీవితంలో ఆనందం నెలకొంటుంది. సోమవారం రోజున ప్రదోష కాలంలో శివుని మూడు రూపాలను పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ శివుని 3 రూపాలు ఏవో తెలుసుకుందాం.

Sravana Masam: శ్రావణ సోమవారం రోజున శివయ్య ఈ రూపాలను ఆరాధించండి.. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది
Lord Shiva
Follow us on

శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో శివ పార్వతులను, విష్ణువు, లక్ష్మిదేవి లను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శ్రవణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ నెలలో శివ పార్వతులు భూమిపై నివసించి, తన భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడని నమ్ముతారు. అందువల్ల శివయ్య ఆశీర్వాదం పొందడానికి భక్తులు శ్రావణ సోమవారం రోజున విశేష పూజలను చేస్తారు. సోమవారం ఉపవాసం ఉంటారు.

శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా శివయ్య మాత్రమే కాదు పార్వతి దేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తుంది.మరియు జీవితంలో ఆనందం నెలకొంటుంది. సోమవారం రోజున ప్రదోష కాలంలో శివుని మూడు రూపాలను పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ శివుని 3 రూపాలు ఏవో తెలుసుకుందాం.

శ్రావణ సోమవారం 2024 తేదీ- శుభ సమయం

ఇవి కూడా చదవండి

పంచాంగం ప్రకారం శ్రావణ సోమవారం ఉపవాసం శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున ఆచరిస్తారు. సప్తమి తిథి ఆగస్టు 12వ తేదీ. ఈ రోజు ఉదయం 04:23 AM నుంచి 05:06 AM వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అదే సమయంలో అభిజీత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు ఉంటుంది.

నీలకంఠుడు

సముద్ర మథనం సమయంలో హాలాహలం బయటకు వచ్చినప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషాన్ని సేవించాడు. తన గొంతులో నిలుపుకున్నాడు. దాని కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది. అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. ఈ నీలకంఠేశ్వరుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు నీలకంఠేశ్వరుని సరైన ఆచార వ్యవహారాలతో పూజించడం ద్వారా శత్రు భయాలు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు, కుట్రలు, తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతాయని చెబుతారు.

శ్రావణ సోమవారం నీలకంఠేశ్వరుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి, శివుని నీలకంఠ రూపాన్ని స్మరించుకుని ఓం నమో నీలకంఠాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. శివుని ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

నటరాజ స్వామీ

నటరాజ రూపం శివునికి సంబంధించిన అద్భుతమైన,ముఖ్యమైన రూపం. ఆయనను నృత్యానికి అధి దేవుడిగా పూజిస్తారు. ఈ రూపంలో శివుడు సృష్టి, నిర్వహణ, విధ్వంస చిహ్నంగా పరిగణించబడుతున్నాడు. నటరాజ విగ్రహం తాండవ నృత్య భంగిమలో శివుడిని వర్ణిస్తుంది. ఇది సృష్టి, సంరక్షణ, వినాశనానికి ప్రతీక. నటరాజ స్వామి ఒక చేతిలో అగ్నిని కలిగి ఉన్నాడు. ఇది వినాశనానికి చిహ్నంగా ఉంది. మరొక చేతిలో సృష్టి. నాద బ్రహ్మకు చిహ్నంగా ఉంది. ఒక చేయి అభయముద్రలో ఉంటుంది. ఇది భయాన్ని తొలగించే సంకేతం. అతని పాదాలలో ఒకదాని క్రింద అజ్ఞానం,అహంకారానికి ప్రతీక అయిన అపస్మర అనే రాక్షసుడు ఉన్నాడు. అతని శరీరం చుట్టూ సర్పాలు చుట్టబడి ఉంటాయి. శక్తి , పునర్జన్మను సూచిస్తాయి, అతని శిగలో గంగా, చంద్రుని కిరీటం చేయబడింది.

శివుని నటరాజ రూపాన్ని ఆరాధించడం సృజనాత్మకత, కళ రంగంలో విజయాన్ని తెస్తుంది, అడ్డంకులను నాశనం చేస్తుంది,ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. నటరాజ స్వామి ఆరాధన జ్ఞానోదయం , ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. నటరాజ స్వామిని ఆరాధించడం ద్వారా, వ్యక్తి జీవితంలో శక్తి, సమతుల్యత, శాంతిని పొందుతుంది. ఇది శివుని అత్యంత శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన రూపాన్ని సూచిస్తుంది. నృత్యం, సంగీతం, కళల ద్వారా జీవితంలోని విభిన్న అంశాలను హైలైట్ చేస్తుంది.

మహామృత్యుంజయ స్వరూపం

శివుడు మహామృత్యుంజయ స్వరూపుడు. ఈ రూపం మృత్యుభయం నుండి విముక్తినిస్తుంది. శివుని ఈ రూపం అత్యంత శక్తివంతమైన, దయగల రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. “ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్” అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతాయి. ఈ రూపాన్ని ఆరాధించడం వలన నయం కాని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. భయం తగ్గుతుంది. జీవితంలో శాంతి లభిస్తుంది. శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలం, ఆత్మబలం లభిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు