
హిందూ మత విశ్వాసం ప్రకారం గ్రహణాన్ని అశుభమైందిగా భావిస్తారు. అందుకనే గ్రహణ సమయాన్ని సూత కాలంగా భావిస్తారు. గ్రహణం పూర్తి అయిన తర్వాత తలకు స్నానం చేసి అనంతరం మళ్ళీ రోజువారీ పనులను మొదలు పెడతారు. ఈ గ్రహణ సమయంలో దుష్ఫలితాలు కలుగుతాయని అందుకనే గర్భిణీ స్త్రీలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం ఏర్పనుంది. అంతేకాదు ఈ నెలలో చంద్ర, సూర్య రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందుకనే ఈ సమయంలో ఎటువంటి పూజలు, శుభ కార్యాలు మాత్రమే కాదు గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మార్చి 14వ తేదీ శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి రోజున అంటే హోలీ పండగలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్ర గ్రహణం ఉదయం ఏర్పడుతుంది. కనుక ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. పశ్చిమ యూరప్, అమెరికా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది. అంతేకాదు మార్చి 29వ తేదీ అమవాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడనున్నది. ఈ సూర్యగ్రహణం కూడా మన దేశంలో కనిపించదు.
ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, యూరప్ వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది.
ఈ చంద్ర, సూర్య గ్రహణాలు మన దేశంలో కనిపించకపోయినా గ్రహణాలు ఏర్పడే సమయం పరిగణలోకి తీసుకుంటే ఒకే నెలలో ఏర్పడనున్న ఈ రెండు గ్రహణాలు మన దేశంపై కూడా కొంత ప్రభావం చూపిస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు. కనుక గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో ఆహారం తినవద్దు అని.. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతున్నారు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. గ్రహణం విడిచిన అనంతరం తల స్నానం చేసిన అనంతరం ఆహారం తీసుకోవాలని అప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు