Sita Navami 2022: భార్యాభర్తల మధ్య వివాదాలా.. సీతానవమిని పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే

|

May 05, 2022 | 12:51 PM

Sita Navami 2022: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం(Vaisakha Maas) శుక్ల పక్షం తొమ్మిదవ రోజున  సీతా నవమిగా జరుపుకుంటారు.  ఈరోజు సీతమ్మ పుట్టినరోజన నమ్మకం. సీతా నవమి..  శ్రీ రామ నవమి..

Sita Navami 2022: భార్యాభర్తల మధ్య వివాదాలా.. సీతానవమిని పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే
Sita Navami
Follow us on

Sita Navami 2022: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం(Vaisakha Maas) శుక్ల పక్షం తొమ్మిదవ రోజున  సీతా నవమిగా జరుపుకుంటారు.  ఈరోజు సీతమ్మ పుట్టినరోజన నమ్మకం. సీతా నవమి..  శ్రీ రామ నవమి(Srirama navami) తర్వాత ఒక నెలకు వస్తుంది. ఈ రోజున సీత మాత దర్శనమిస్తుందని ప్రతీతి. ఈ రోజును జానకీ నవమి లేదా సీతా జయంతి ( సీతా నవమి 2022 )గా జరుపుకుంటారు. ఈరోజున సీతారాములను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు. తాము సుమంగళిగా జీవిస్తామని.. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని నమ్మకం.  ఈ సంవత్సరం సీతా నవమి మే 10 న వచ్చింది. ఈ రోజు ప్రాముఖ్యత, పూజా సమయం గురించి తెలుసుకుందాం.

సీతా నవమి 2022 
హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసం శుక్ల పక్షం నవమి మే 9వ తేదీ సోమవారం వచ్చింది. ఆ రోజు  సాయంత్రం 6:32 గంటలకు నవమి ఘడియలు ప్రారంభమై.. మే 10వ తేదీ మంగళవారం రాత్రి 7:24 గంటలకు నవమి తిథి ముగుస్తుంది. అయితే నవమి ఉదయ తిధి ఆధారంగా మే 10వ తేదీన సీతా నవమి వ్రతం నిర్వహిస్తారు.

ఈ ఏడాది సీతా నవమి శుభ ముహూర్తం: 
మే 10వ తేదీ ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 1:39 వరకు సీతా నవమి శుభ ముహూర్తాలు. సీతా నవమి శుభ సమయం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగుతుంది.

సీతా నవమి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, ఒకప్పుడు మిథిలా రాజు జనకుడు పొలాలను దున్నుతున్నాడు. ఆ సమయంలో జనకుడికి  కుమార్తె రూపంలో సీతమ్మ దొరికింది. తరువాత సీతమ్మ శ్రీరామునితో వివాహం చేసుకుంది. సీతారాములకు లవుడు, కుశుడు అనే ఇద్దరు కుమారులున్నారు. వివాహిత స్త్రీలు సీతానవమి రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. సీతానవమి రోజున సీతారాములను పూజించిన వారికీ అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజున సీతామాతను పూజించడం వల్ల తీర్థయాత్రలు, దానధర్మాల చేసినప్పుడు కలిగిన ఫలం కంటే అధిక ఫలితం దక్కుతుందని నమ్మకం. దంపతులు  వైవాహిక జీవితంలోని కష్టాలను తొలిగి..  సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని నమ్మకం.

సీతా నవమి పూజా విధానం
సీతా నవమి నాడు తెల్లవారు జామునే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. ఇంటిని, పూజగదిని శుభ్రంచేసుకోవాలి. ఒక పీఠం ఏర్పరచుకుని పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని వేసుకోవాలి. అనంతరం సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్టించాలి. సీతాదేవికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, జాకెట్ వంటి మంగళకరమైన వస్తువులను సమర్పించాలి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అక్షతలు, ఎరుపు, పసుపు పుష్పాలు, ధూపం మొదలైన వాటితో పూజించండి. ఓం సీతాయై నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి.  నైవేద్యంగా ఆహారపదార్ధాలను సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సంచరం నమ్మకం మీద ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

నేటి నుంచి 5 రోజుల పాటు రామానుజుల జయంతోత్సవాలు.. చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో విశేష కైంకర్యాలు

 శ్రీరామ భక్తులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. రెండు దేశాలను కలుపుతూ ‘శ్రీ రామాయణ యాత్ర’

ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..