సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణను ప్రారంభించి పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనం వాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదక్షిణ చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం, జిల్లా అధి కార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు.
గిరి ప్రదక్షిణ చేస్తే భువి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి.. 32 కిలోమీటర్ల కాలినడకన గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొండ దిగువన తొలిపావంచా వద్ద స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్తలు రథాన్ని ప్రారంభిస్తారు. రథం తొలిపావంచా నుంచి పాత అడివివరం మీదుగా సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, హనుమం తవాక, విశాలక్షినగర్ మీదుగా జోడుగుళ్లు పాలెం బీచ్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అప్పుఘర్, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్బీకాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, డీఎల్బీ క్వార్టర్స్, మాధవధార, మురళీ నగర్, ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం. బంకు, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.
గిరి ప్రదక్షణకు ఏపీ తెలంగాణ నుంచి కర్ణాటక ఒరిస్సా తమిళనాడు నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ఈ గిరిప్రదక్షిణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికార యంత్రంగం. భక్తులు నడిచే 32 కిలోమీటర్ల మేర ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. స్టాళ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఫలహారాలు ప్రసాదం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా అంబులెన్సులు, మెడికల్ క్యాంపు లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం రెవెన్యూ జీవీఎంసీ పోలీస్ వైద్య ఆరోగ్యశాఖ ఆర్టీసీ విద్యుత్ ఫైర్ ఎక్సైజ్ శాఖ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సేదదీరేందుకు 25 ప్రాంతాల్లో స్టాళ్లు 22 ప్రదేశంలో మహిళలు పురుషులకు వేరువేరుగా 300 వరకు తాత్కాలిగా మరుగుదొడ్లు 11 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు 12 చోట్ల 17 అంబులెన్స్ తొమ్మిది జనరేటర్లు, ఆరు పబ్లిక్ అడ్రస్ సింగ్ సిస్టం లను ఏర్పాటు చేశారు.
గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మాధవధార, అప్పుఘర్ ప్రాంతాల్లో స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. సముద్ర స్నానాలు చేసే చోట ప్రత్యేక స్విమర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మాధవధార లో బోర్ తో పాటు జల్లుల స్నానం ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు అధికారులు.
కొండ దిగువన తొలిప్రేవంచ నుంచి స్వామివారి పుష్పరతం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది. స్వామివారి మూలవిరాట్ ఉత్సవమూర్తులు కొలవదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిప్రేమంచే వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. తొలిరోజు ఉదయాన్నే గిరిప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి పది గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నెరవేరామంగా దర్శనాలుమతాయి. తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు రాత్రి 8:30 నుంచి రాత్రి 9:00 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఆదివారం నాడు ఆలయ ప్రదర్శన చేసే భక్తులకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అనుమతిస్తారు.
సింహాచలంలోని తొలపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్యూలు 80 గడ్డర్లు సిద్ధం చేస్తున్నారు. ఆలయ ప్రదక్షిణ కు సంబంధించి ఉత్తర రాజగోపురం దక్షిణ రాజగోపురం వద్ద వంతెన సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జ్ లపై నుంచి ప్రదక్షిణాలు చేసే భక్తులు కింద నుంచి దర్శనానికి భక్తులు వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గిరి ప్రదక్షణ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో కిలోమీటర్లకు మూడు పాయింట్లు ప్రత్యేక పర్యవేక్షకుడిని పెడుతున్నారు. భక్తుల్లో ఎవరికైనా అస్వస్థత గురైతే… అంబులెన్స్లకు అదనంగా పోలీసులు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. 21వ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొండపై నుంచి దిగువకు భక్తులకు దేవస్థానం బస్సులతో పాటు దేవస్థానం నగదు చెల్లించిన 45 ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా చేరవేస్తారు.
గిరి ప్రదక్షిణ నేపథ్యంలో శనివారం ఆదివారంలో నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాలినడకన రోడ్లపై గిరిప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తుతో పాటు ముందస్తు ప్రణాళికలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతాల్లో శని ఆదివారాల్లో ప్రత్యామ్నాయం రహదారుల్లో ప్రయాణించాలని సూచించారు పోలీసులు. సింహాచలం గిరిప్రదక్షిణను ప్రతిష్టాత్మక తీసుకున్నారు జిల్లా అధికార యంత్రంగం. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..