వినాయక చవితి సందడి ముగిసింది. దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రుల సందడి మొదలైంది. నవరాత్రులకు మరికొద్ది రోజులు సమయం మాత్రమే సమయం ఉంది. దేశ వ్యాప్తంగా అమ్మవారి పూజ కోసం భక్తులు రెడీ అవుతున్నారు. శారదీయ నవరాత్రి ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఆ సేతు హిమాచలంలోని అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొత్తగా అలంకరిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకంగా పూజలను అందుకునే ఆలయాల్లో ఒకటి భగవతి దేవి ఆలయం. హిందూ మతం ప్రకారం ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని ప్రధాన సిద్ధపీఠాలలో ఒకటి. మహామాయ దేవి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా నవరాత్రుల్లో ఈ ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని పుజిస్తారు. నవరాత్రి ఉత్సవాలు కన్యక బాలిక చేతులతో దీపం వెలిగించడం ద్వారా మొదలు చేస్తారు. ఇది ఈ ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం. అమ్మావారే స్వయంగా కన్యక బాలిక రూపంలో వచ్చి దీపాన్ని వెలిగిస్తారని స్థానికుల నమ్మకం.
మహామాయ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది. అమ్మవారి పట్ల అత్యంత భక్తి విశ్వాసాలతో ఇక్కడకు భక్తులు చేరుకుంటారు. తమ కోరిక తీర్చమంటూ మహామాయ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ముందు దీపాలు వెలిగిస్తారు. అమ్మవారి ముందు దీపం వెలిగింఛి మనసులోని కోరికను వ్యక్తం చేస్తే తమ కోరిక నెరవేరుతుందని నమ్మకం. మహామాయ కోరికల దీపాన్ని వెలిగించడం ద్వారా భక్తుల కోరికలన్నీ తీరుస్తుందని చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇది 1400 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి