యూపీలో వర్షం బీభత్సం.. ఆగ్రా వీధుల్లో పడవలతో ప్రయాణం.. నీట మునిగిన ఇల్లు, షాప్స్

ఉత్తరప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 12 గంటల్లో దాదాపు 23.4 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. రాష్ట్రంలో ఆగ్రాతో సహా అనేక ఇతర నగరాల్లో పడవలు నడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 60కి పైగా జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రయాగ్‌రాజ్‌తో సహా అనేక జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలు గ్రౌండ్ ఫ్లోర్ వదిలి మొదటి అంతస్తులో తలదాచుకున్నారు.

యూపీలో వర్షం బీభత్సం.. ఆగ్రా వీధుల్లో పడవలతో ప్రయాణం.. నీట మునిగిన ఇల్లు, షాప్స్
Rains In Up
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2024 | 12:15 PM

రుతుపవనాలు నిష్క్రమించే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. బుధవారం 11 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, డ్రెయిన్లు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతంగా ఉండటంతో పలు నగరాల్లోని రోడ్లు మోకాళ్లలోతు నీటితో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల దాదాపు మనిషి నీటిలో మునిగే వరకూ వరద ప్రవాహం చేరుకుంది. అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఆగ్రాతో సహా అనేక ఇతర నగరాల్లో పడవలు నడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 60కి పైగా జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

ప్రయాగ్‌రాజ్‌తో సహా అనేక జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలు గ్రౌండ్ ఫ్లోర్ వదిలి మొదటి అంతస్తులో తలదాచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 12 గంటల్లో దాదాపు 23.4 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. రాష్ట్రంలోని 60కి పైగా జిల్లాల్లో ఈ సగటు వర్షపాతం 482 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. రెవెన్యూ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో హమీర్‌పూర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతం 4.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది..అయితే ఈసారి 3240 శాతం ఎక్కువ అంటే 137 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డులను బద్దలు కొట్టింది.

ప్రయాగ్‌రాజ్‌లో నీటమునిగిన 10 వేల ఇళ్లు

ఇవి కూడా చదవండి

ఆగ్రాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ 11 గంటలపాటు కురిసిన వర్షం కారణంగా నగరంలోని దాదాపు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దిగువ ప్రాంతాల్లో మోకాళ్లలోతు, కొన్ని చోట్ల నడుము లోతు వరకు నీరు చేరింది. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో ఈ వర్షం కారణంగా గంగా, యమునా నదులు రెండు విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 10 వేల ఇళ్లు వరదల బారిన పడ్డాయి. ఈ ఇళ్లలోని వ్యక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కొందరు మొదటి అంతస్తులో తలదాచుకుంటున్నారు. శ్రీకృష్ణుని నగరమైన మధురలో కనుచూపు మేరలో ఉపశమనం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..