Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keto Diet: కీటో డైట్‌తో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

కీటో డైట్ తో బరువు తగ్గడమే కాకుండా ఈ ఆహారం శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కీటో డైట్‌లో శరీరానికి శక్తిని అందించే ఆహారాలు ఉన్నాయి. దీంతో ఈ డైట్ అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కీటో డైట్ టైప్-2 డయాబెటిస్‌కు కారణమవుతుందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది.

Keto Diet: కీటో డైట్‌తో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
Keto Diet
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2024 | 11:55 AM

ప్రస్తుతం బరువు తగ్గడానికి రకరకాల డైట్‌లు ఫాలో అవుతున్నారు. ఇందులో కీటోజెనిక్ డైట్ అంటే కీటో డైట్ కూడా ఒకటి. ఈ డైట్ లో తక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ కొవ్వుని వినియోగిస్తారు. అంతేకాదు ఈ ఆహారంలో ప్రోటీన్ మొత్తం ఎక్కువగా తీసుకోబడుతుంది. కీటో డైట్ తో బరువు తగ్గడమే కాకుండా ఈ ఆహారం శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.

కీటో డైట్‌లో శరీరానికి శక్తిని అందించే ఆహారాలు ఉన్నాయి. దీంతో ఈ డైట్ అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కీటో డైట్ టైప్-2 డయాబెటిస్‌కు కారణమవుతుందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. 2024లో డాక్టర్ బార్బోరా డి కోర్టేనే, రోబెల్ హుస్సేన్ కబ్తిమ్మర్, మోనాష్ యూనివర్శిటీకి చెందిన వైద్య బృందం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం చాలా కాలంగా ట్రెండింగ్‌లో ఉన్న కీటో డైట్‌ని అనుసరించడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైంది.

అధ్యయనం ఏం చెబుతోందంటే

39,000 మంది యువతను అబ్జర్వేషన్‌లో ఉంచి వీరిపై పరిశోధన చేశారు. తక్కువ కార్బ్ ఆహారం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. అయితే ఈ అధ్యయనంలో వ్యతిరేక ఫలితం వెలుగులోకి వచ్చింది. తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రొటీన్లు, అధిక కొవ్వు ఆహారాన్ని అనుసరించే వ్యక్తులలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ప్రొఫెసర్ బార్బోరా డి కోర్టనే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సంతృప్త కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత సమస్య తలెత్తుతుందని చెప్పారు. చక్కెర పెరగడానికి ఇది ఒక కారణం.

ప్రజలు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్‌లకు బదులుగా సంతృప్త కొవ్వు, తక్కువ ఫైబర్ పదార్థాలను తీసుకుంటే అది బరువు పెరగడానికి దారితీస్తుందని అంటే ఊబకాయ ప్రమాదానికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ డైట్ తీసుకున్న వారి BMI కూడా పెరగవచ్చు. ఆహారంలో కార్బోహైడ్రేట్లు లేకపోవడం, అదనపు కొవ్వు కారణంగా ఇలా జరుగుతుంది. శరీరంలో కొవ్వు పెరిగితే అది టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

పరిశోధకుల ప్రకారం ఏమి చేయాలంటే

ప్రతి ఒక్కరి శరీరానికి కొవ్వు పదార్ధం అవసరం. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని ఎక్కువసేపు తీసుకోకుండా ఉండాలని పరిశోధకుడు చెప్పారు. అందువల్ల పోషకాల కోసం సమతుల్య ఆహార ప్రణాళికను రూపొందించడం ఉత్తమ మార్గం. రిఫైన్డ్ షుగర్, సాఫ్ట్ డ్రింక్స్, వైట్ బ్రెడ్, జ్యూస్, వైట్ షుగర్, రైస్, బంగాళదుంపల స్థానంలో అవోకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్, సాల్మన్ వంటి కొవ్వు చేపలు ఉంటాయి. అంతేకాదు మెరుగైన ఆరోగ్యానికి సమతుల్య ఆహారం అవసరం.

నిపుణులు ఏమన్నారంటే

దీర్ఘకాలం పాటు కీటో డైట్‌ని అనుసరించడం వల్ల కొందరిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ సుభాష్ గిరి వివరిస్తున్నారు. కీటో డైట్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం..శరీరానికి గ్లూకోజ్ అందకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచవచ్చు. దీని కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.అయితే ఇలా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..