Viral Video: తలలో షికారు చేస్తోన్నపేలు.. డాక్టర్‌కి కాదు పెస్ట్ కంట్రోల్ కాల్ చేయమంటున్న నెటిజన్లు
పేలు ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తాయి. కనుక పేలు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న ఈ వీడియో హెయిర్ స్టూడియో నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక యువతి జుట్టుని చూపిస్తున్నారు.
ఈ రోజుల్లో తలలో పేలు సమస్య సర్వసాధారణం. చిన్నపిల్లలైనా, పెద్దవారైనా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పేలు సమస్య ఎక్కువగా బాధిస్తుంది. వెంట్రుకలు శుభ్రంగా ఉండకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సకాలంలో తగిన విధంగా నివారణ చర్యలు తీసుకోక పోతే ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది. ఈ పేలు ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తాయి. కనుక పేలు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో హెయిర్ స్టూడియో నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక యువతి జుట్టుని చూపిస్తున్నారు. వెంట్రుకల్లో పేలు చకచకా కదులుతున్నాయి. ఇక పేన్ల గుడ్డు చూస్తే ఆ యువతి తలని పేలు తమ నివాస స్థలంగా మార్చుకున్నట్లు అనిపిస్తుంది ఎవరికైనా.. యువతి జుట్టు మధ్యలో వేల పేనులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత పెస్ట్ కంట్రోల్ వ్యక్తులను పిలవమని చాలా మంది ఆమెకు సలహా ఇవ్వగా.. కొంతమంది ఆమెకు డాక్టర్ వద్దకు వెళ్లమని సలహా ఇచ్చారు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
యువతి జుట్టు మధ్యలో వేల సంఖ్యలో పేనులు చకచకా కదులుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో తీస్తున్న వ్యక్తి.. ఆమె పరిస్థితి చూసి తాను ఈ పేలకు ట్రీట్‌మెంట్ ఇక్కడ చేయలేమని చెప్పాడు. వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళమని సలహా చెబుతున్నాడు. ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఈ దృశ్యాన్ని భయపెడుతున్నారు.
ఈ వీడియో ఇన్‌స్టాలో suraj.mudra అనే ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను లక్షలాది మంది చూసి, కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఒక వినియోగదారు, ‘వైద్యుడిని కాదు, పెస్ట్ కంట్రోల్ వ్యక్తిని పిలవండి’ అని రాస్తే, మరొకరు ‘మీ తలలో పేలు లేవు.. పేల్లో తల ఉంది’ అని రాశారు. మరొకరు ఇన్ని పేనులు అయ్యే వరకూ ఎలా ఉన్నారు.. ఒక్క పెను ఉంటేనే నిద్ర పట్టదు అని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..