AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఇదో ముదురు మన్మథుడి ప్రేమ కథా చిత్రమ్.. ప్రియుడి కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. వీడియో

ఇది ఓ ముదురు మన్మథుడి వీర ప్రేమ గాథ. ఆ మన్మథుడు ఒకరికి తెలియకుండా మరొకరిని తెగ లవ్‌ చేశాడు. రోజుకు రెండు షిఫ్టుల్లో ప్రేమను పంచుతూ... ఇద్దరు మహిళలను ప్రేమలో ముంచేశాడు. మొన్నటివరకు మరో చరిత్రలా సాగిన వీరి ప్రేమ.. ఇప్పుడు అదో చరిత్ర అయిపోయింది. ఒక ప్రియుడు... ఇద్దరు ప్రియురాళ్ల లవ్‌ చివరకు సీన్‌ సితారైంది.

AP News: ఇదో ముదురు మన్మథుడి ప్రేమ కథా చిత్రమ్.. ప్రియుడి కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. వీడియో
Two Women Fight For Boyfried
Shaik Madar Saheb
|

Updated on: Sep 19, 2024 | 10:27 AM

Share

ఇది ఓ ముదురు మన్మథుడి వీర ప్రేమ గాథ. ఆ మన్మథుడు ఒకరికి తెలియకుండా మరొకరిని తెగ లవ్‌ చేశాడు. రోజుకు రెండు షిఫ్టుల్లో ప్రేమను పంచుతూ… ఇద్దరు మహిళలను ప్రేమలో ముంచేశాడు. మొన్నటివరకు మరో చరిత్రలా సాగిన వీరి ప్రేమ.. ఇప్పుడు అదో చరిత్ర అయిపోయింది. ఒక ప్రియుడు… ఇద్దరు ప్రియురాళ్ల లవ్‌ చివరకు సీన్‌ సితారైంది. చివరకు వీళ్ల ప్రేమ.. మహిళలిద్దరూ పొట్టుపొట్టుగా కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది.

సినిమాల్లో హీరో- విలన్‌ ఫైట్‌ను మించిపోయింది. వాడు నా వాడు అంటూ… కాదు.. నా వాడు అంటూ తెగ కొట్టేసుకున్నారు ఇద్దరు మహిళలు. రా చూసుకుందాం… నీ ప్రతాపమో నా ప్రతాపమో అన్నట్లు జుట్లు పట్టుకుని మరీ రెచ్చిపోయారు. చుట్టుపక్కల వాళ్లకి 70MMలో ప్రియుడి కోసం ఫైట్‌ పేరుతో సినిమా చూపించారు. ఈ క్రమంలో ఓ మహిళ బంధువులు ప్రియుడి కారుపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

Machilipatnam News

Machilipatnam: Two women fight for boyfriend

అతను ఎవరనుకుంటున్నారా..? బుద్దిమంతుడిలా కనిపించే అతని పేరు విజయ్‌.. ఆలియాస్‌ బిల్డప్‌ బాబాయ్. బిల్డర్‌గా బిల్డింగులు కడుతూనే… ఇద్దరి మహిళల మనసుల్లో ప్రేమ డూప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయనం నడిపాడు. ఓ శుభ ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బట్టబయలైంది. ఇక ఇద్దరు మహిళలు కలిసి ప్రియుడిని చితకబాదుతారనుకుంటే.. సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది. ప్రియుడి కోసం ఈ ఇద్దరు మహిళలు జట్టు పట్టుకుని కొట్టుకున్నారు.

వీడియో చూడండి..

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ప్రియుడు విజయ్‌తో పాటు ఇద్దరు మహిళలపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గాఢంగా ప్రేమిస్తే… తనను నట్టేట ముంచాడంటోంది మహిళ. గుడ్డిగా నమ్మి… 15 లక్షల నగదుతో పాటు 10 లక్షల విలువ చేసే బంగారాన్ని ఇచ్చేశానంటూ లబోదిబోమంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..