Shri Yantra Mandir: గంగానదీ తీరంలోని మహా దేవాలయం వెరీ వెరీ స్పెషల్.. ఇసుక, సిమెంట్ లేకుండా నిర్మాణం..
హరిద్వార్‌లోని శ్రీ యంత్ర దేవాలయం మిగిలిన ఆలయాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రత్యేకతకు కారణం ఏకైక గోపురం.. దీని కారణంగా ఈ ఆలయం మిగిలిన వాటి కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయ బయటి గోడలు, సరిహద్దులపై నక్షత్రాల నమూనాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం ఎంతో అందంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో.. ఈ ఆలయ నిర్మాణానికి ఇనుము, సిమెంట్ ఉపయోగించకపోవడం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది.
దేవభూమి ఉత్తరాఖండ్ లోని ప్రముఖ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. గంగా నది తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఒకటి హరిద్వార్. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ ఉన్న ఓ ఆలయం వెరీ వెరీ స్పెషల్. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో ఇనుము, సిమెంట్ ఉపయోగించలేదు. ఇప్పటికీ..ఈ ఆలయ నిర్మాణం చాలా గ్రాండ్‌గా ఉంటుంది. దీనిని చూసిన వారందరూ మైమరచిపోతారు. అయితే ఈ మహా దేవాలయం నిర్మాణంలో ఎలాంటి వస్తువులు ఉపయోగించారనే ప్రశ్న తలెత్తుతోంది.
శ్రీ యంత్ర దేవాలయం హరిద్వార్ హరిద్వార్ హిందువుల విశ్వాస కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ రకరకాల దేవుళ్లకు సంబంధించిన అనేక గొప్ప, పురాతన దేవాలయాలు ఉన్నాయి. గంగా నది ఒడ్డున అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటిలో ఒకటి శ్రీ యంత్ర ఆలయం. ఈ ఆలయం గంగా నది ఒడ్డున ఉన్న కంఖాల్‌లో ఉంది. ఈ ఆలయం అత్యంత గౌరవనీయమైన శక్తి ఆరాధన కేంద్రాలలో ఒకటి. సాధన కోసం అద్భుతమైన, తగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో సాధన, హవన, యాగం, పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
సిమెంట్-ఇనుము ఉపయోగించలేదు హరిద్వార్‌లోని శ్రీ యంత్ర దేవాలయం మిగిలిన ఆలయాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రత్యేకతకు కారణం ఏకైక గోపురం.. దీని కారణంగా ఈ ఆలయం మిగిలిన వాటి కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయ బయటి గోడలు, సరిహద్దులపై నక్షత్రాల నమూనాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం ఎంతో అందంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో.. ఈ ఆలయ నిర్మాణానికి ఇనుము, సిమెంట్ ఉపయోగించకపోవడం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది.
వేటిని ఉపయోగించారంటే ఆలయ అందాలు, అద్భుతమైన చెక్కడాలు చూసిన వారిని ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఈ అందమైన నిర్మాణం ఇనుము, సిమెంటు లేకుండా ఏయే సామాగ్రి ఉపయోగించారో కనిపెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే అత్యంత సుందరంగా ఉండే ఈ ఆలయం రాజస్థాన్‌లోని అత్యుత్తమ రాళ్లతో నిర్మించబడింది.
శ్రీ మహా లక్ష్మి శ్రీ యంత్రం ప్రతిష్టాపన ఈ ఆలయం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఇక్కడ లక్ష్మీ దేవికి సంబంధించిన శ్రీ యంత్రం ప్రతిష్టించబడినందున.. ఈ ఆలయానికి శ్రీ యంత్ర ఆలయం అని పేరు వచ్చింది. ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ ఉన్న 10 మహావిద్యలలో మూడవ స్థానంలో ఉంది. ఈ ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు త్రిపుర సుందరితో పాటు కాళికా దేవి విగ్రహం కూడా బంగారంతో తయారు చేశారు. ఈ రెండు విగ్రహాలే కాదు లక్ష్మీదేవి, సరస్వతీ దేవి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. అలాగే ఆలయంలో భోలే నాథుడు ప్రతిష్టించబడ్డాడు. ఆలయంలో రెండు శ్రీ యంత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు