
శ్రావణ మాసంలో శివ కేశవులను లక్ష్మిదేవి మంగళ గౌరీ లను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, జూలై 28 కోరికలను కోరుకోవడానికి.. వాటిని నెరవేర్చుకోవడానికి శక్తివంతమైన రోజు. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఈ రోజు శ్రావణ మాసం మొదటి సోమవారం అంతేకాదు సంకహర వినాయక చవితి. ఈ రెండు రెండు సందర్భాలు ఈ రోజును చాలా ప్రత్యేకమైనవిగా చేస్తున్నాయి. భక్తులు నిర్మల మైన హృదయంతో తమకు కావలసినది కోరుకోవచ్చు. శివుడు, గణేశులు సంతోషించి తన భక్తులను అనుగ్రహించే అవకాశం ఉందని నమ్మకం.
శ్రావణ మాసంలోని ప్రతి రోజూ ప్రవిత్రమైనవే.. అయితే సోమవారాలను శివుడిని పూజించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అంతే కాదు సంకహర వినాయక చవితి అనేది గణేశుడిని పూజించే పండుగ. జీవితంలోని అన్ని కష్టాలను, అడ్డంకులను తొలగించే దేవుడు. జూలై 28న చతుర్థి తిథి జూలై 27న రాత్రి 10:40 గంటలకు ప్రారంభమై జూలై 28న రాత్రి 11:24 గంటలకు ముగుస్తుంది. ఈ నేపధ్యంలో సంకహర వినాయక చవితిని జూలై 28న జరుపుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.