AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2024: నేడు నవరాత్రులలో 8వ రోజు.. మహాగౌరీ దేవిని ఇలా పూజించండి.. సమస్యలు తొలగుతాయి, సంపదలు వర్షిస్తాయి

దుర్గాదేవి ఎనిమిదవ రూపమైన మహాగౌరిని పూజించడానికి ఉదయాన్నే స్నానం చేసి తెల్లని బట్టలు ధరించండి. ఆ తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి, గంగాజలంతో మహాగౌరి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని శుభ్రం చేయండి. మహాగౌరికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక పూజలో తెల్లని రంగుల పువ్వులు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని తరువాత అమ్మవారికి పసుపు, కుంకుమలను దిద్దండి. తరువాత స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు సమర్పించండి.

Navratri 2024: నేడు నవరాత్రులలో 8వ రోజు.. మహాగౌరీ దేవిని ఇలా పూజించండి.. సమస్యలు తొలగుతాయి, సంపదలు వర్షిస్తాయి
Mahagauri Devi Puja
Surya Kala
|

Updated on: Oct 10, 2024 | 7:08 AM

Share

హిందూ మతంలో నవరాత్రి పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో భక్తులు దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. నవరాత్రుల అష్టమి తిథి రోజున మహాగౌరీ దేవిని పూజిస్తారు. మహాగౌరి దేవిని ఆచారాల ప్రకారం పూజించిన భక్తులకు అన్ని రకాల అశుభాలు పరిష్కారమవుతాయని, అన్ని రకాల రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజు మహాగౌరిని పూజించే శుభ సమయం, పూజా విధి, పాటించాల్సిన మంత్రాలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

మహాగౌరి ఆరాధన శుభ సమయం

వేద పంచాంగం ప్రకారం మహాగౌరీ దేవిని పూజించడానికి అనువైన సమయం ఉదయం 11:45 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఈ శుభ సమయంలో పూజలు చేయడం శుభప్రదం.

మహాగౌరీ పూజ విధి

దుర్గాదేవి ఎనిమిదవ రూపమైన మహాగౌరిని పూజించడానికి ఉదయాన్నే స్నానం చేసి తెల్లని బట్టలు ధరించండి. ఆ తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి, గంగాజలంతో మహాగౌరి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని శుభ్రం చేయండి. మహాగౌరికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక పూజలో తెల్లని రంగుల పువ్వులు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని తరువాత అమ్మవారికి పసుపు, కుంకుమలను దిద్దండి. తరువాత స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు సమర్పించండి. నవరాత్రులలో అష్టమి రోజున మహాగౌరీ దేవిని పూజించేటప్పుడు శనగలను నైవేద్యంగా సమర్పించాలి. అష్టమి తిథిలో ఆడపిల్లల పూజ కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని తరువాత హారతి ఇచ్చి మంత్రాలను జపించండి.

ఇవి కూడా చదవండి

మహాగౌరికి ఇష్టమైన నైవేద్యం, పుష్పం

దుర్గాదేవి ఎనిమిదవ రూపమైన మహాగౌరికి మల్లె పువ్వు అంటే చాలా ఇష్టం. ఈ రోజున అమ్మవారి పాదాల వద్ద ఈ మల్లి పువ్వులను సమర్పించాలని నమ్ముతారు. దీనితో పాటు తప్పకుండా అమ్మవారికి కొబ్బరి బర్ఫీ, లడ్డూ నైవేద్యంగా పెట్టండి. ఎందుకంటే కొబ్బరి తల్లికి ఇష్టమైన ఆహారంగా భావిస్తారు.

మహాగౌరీ మంత్రాన్ని జపించడం

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే

మహాగౌరి ప్రార్థన మంత్రం

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః । మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ।

మహాగౌరి ధ్యాన మంత్రం

యా దేవి సర్వ భూతేషు, శాంతి రూపేణ సంస్థితా

యా దేవి సర్వ భూతేషు శక్తు రూపేణ సంస్థితా

యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా

యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

మహాగౌరి స్తోత్రం మంత్రం

దేవి త్వదీయచరణాంబుజరేణు గౌరీం ,భాలస్థలీం వహతి యః ప్రణతిప్రవీణః |జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా,తాం గౌరయత్యతితరాం కిల తస్య పుంసః ||

మహాగౌరిదేవి ప్రాముఖ్యత

మహాగౌరీదేవిని పూజించడం ద్వారా మనిషి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. వ్యక్తి వ్యాధులు తగ్గడమే కాదు కష్టాలు తగ్గుతాయని నమ్మకం. మహాగౌరీని ఆరాధించడం వల్ల వైవాహిక జీవితం, వ్యాపారం, సంపద, ఆనందం పెరుగుతాయి. అంతే కాకుండా మహాగౌరీ దేవిని పూజించడం వల్ల వివాహాంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి