ఈ ఏడాది దేవీ నవరాత్రులు 9 కాదు 10 రోజులు.. దుర్గాదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోండి

|

Oct 01, 2024 | 3:00 PM

ఆశ్వయుజమాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. కొన్ని పంచాంగం ప్రకారం ఈసారి అష్టమి.. నవమి తిథి రెండూ అక్టోబర్ 11 న వచ్చాయి. అటువంటి పరిస్థితిలో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 12వ తేదీ. దసరా పండగ ఉదయం తిధిలో జరుపుకుంటారు కనుక.. 2024 శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాదు మొత్తం10 రోజులు జరుపుకోనున్నారు.

ఈ ఏడాది దేవీ నవరాత్రులు 9 కాదు 10 రోజులు.. దుర్గాదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోండి
Navaratri 2024
Follow us on

పితృ పక్ష 2024 ముగియనుంది. వెంటనే శరన్నవరాత్రులు మొదలు కానున్నాయి. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి అవతారాలైన తొమ్మిది మంది దేవతలను పూజిస్తారు. అమ్మవారి పేరుతో ఉపవాసం ఉంటారు. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈసారి నవరాత్రులు 03 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభంకానున్నాయి. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుపుకోవడం సాంప్రదాయం. అయితే ఈసారి మాత్రం నవరాత్రి ఉత్సవాలను 0 రోజుల పాటు జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది నవరాత్రులు 9 కాదు 10 రోజులు ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకుందాం.

నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే?

నవరాత్రులు ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి. నవరాత్రులు 11 అక్టోబర్ 2024 వరకు కొనసాగనున్నాయి. విజయదశమి పండుగ అక్టోబర్ 12 న జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా తొమ్మిది రూపాలను పూజిస్తారు. వారి పేర్లతో ఉపవాసం ఉంటారు. దీని తరువాత పదవ రోజున చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగా దసరా వేడుకను జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

10 రోజుల పాటు నవరాత్రులు ఎందుకంటే

ఆశ్వయుజమాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. కొన్ని పంచాంగం ప్రకారం ఈసారి అష్టమి.. నవమి తిథి రెండూ అక్టోబర్ 11 న వచ్చాయి. అటువంటి పరిస్థితిలో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 12వ తేదీ. దసరా పండగ ఉదయం తిధిలో జరుపుకుంటారు కనుక.. 2024 శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాదు మొత్తం10 రోజులు జరుపుకోనున్నారు.

4 రోజుల్లోనే ఈ 2 అరుదైన యోగాలు

నవరాత్రులలో మహాశక్తికి ప్రతీకగా భావించే దుర్గామాతను పూజిస్తారు. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని, జీవితంలో సానుకూలత, బలం చేకూరుతుందని నమ్మకం. ఈసారి నవరాత్రుల రోజున అరుదైన యోగం కూడా రూపొందుతోంది. ఇది సర్వార్థ సిద్ధి యోగం. ఇది శుభ యోగం. ఈ యోగంలో పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఈసారి నవరాత్రుల సందర్భంగా 4 రోజులు.. ఈ యోగాలు పడుతున్నాయి. పంచాంగం ప్రకారం ఈ అరుదైన యోగా అక్టోబర్ 5 న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు ఉంటుంది. దీంతో పాటు ఈసారి నవరాత్రుల సందర్భంగా అరుదైన రవియోగం కూడా ఏర్పడుతోంది. ఈ శుభ యోగంలో పూజించడం వల్ల సమాజంలో వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో లాభాలు పొందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి