
హిందువుల విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం ప్రత్యేక పూజలను చేస్తారు. ఈ నెలలో శివుడి ఎవరి పట్ల అయినా సంతోషిస్తే.. అతను ఖచ్చితంగా ఏదో ఒక సూచన ఇస్తాడని నమ్మకం. శ్రావణ మాసంలో ఎవరికైనా కలలో పాములు కనిపించినా.. ముఖ్యంగా జంట పాములు కనిపిస్తే అటువంటి కల ప్రత్యేక సంకేతాలను ఇస్తుందని స్వప్న శాస్త్రం పేర్కొంది. జంట పాములు కనిపిస్తే ఆ కలకు ఆర్ధం ఏమిటో తెలుసుకుందాం.
జత పాములను చూసినప్పుడు ఏమి జరుగుతుంది?
శ్రావణ మాసంలో జంట పాములను చూడటం ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుందని నమ్ముతారు. శ్రావణ మాసంలో ఎవరి కలలోనైనా జంట పాములు కనిపించడం అంటే ఇంట్లో శుభ కార్యాలయాలు జరగనున్నాయని అర్థం. ఇటువంటి కల సంపద, శ్రేయస్సు, ఆనందానికి సంకేతం కూడా కావచ్చు.
సనాతన ధర్మం ప్రకారం కలలో పాముల జత చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇటువంటి కల జీవితంలో అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం. కలలో పాముల జంటను చూడటం అంటే త్వరలో మీ కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఆనందం వస్తుందని అర్ధమట. అంతేకాదు స్వప్న శాస్త్రం ప్రకారం కలలో జంట పాములు కనిపిస్తే వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారని అర్ధం. అంతేకాదు ఆ ఇంట్లో సంపదకు లోటు ఉండదట.
పొలంలో జంట పాములను చూస్తే
శ్రావణ మాసంలో కలలో మాత్రమే కాదు ఆరు బటయ ఎక్కడైనా జత పాములు కనిపిస్తే.. అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఒక జత పాములు కనిపించడం కుటుంబ సభ్యులకు పురోగతికి, జీవిత దుఃఖాల నుంచి విముక్తికి సంకేతం కావచ్చు. ఎవరైనా భూమిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటే ఆక్కడ అనుకోకుండా జత పాములు కనిపిస్తే.. అది ఆ భూమిని కొనుగోలు చేయడానికి ఇది శుభ సంకేతం. అక్కడ భూమి కొనుగోలు చేయడం వలన సంపద వృద్ధి పొందనున్నదట.
కలలో తెల్ల జంట సర్పాలు కనిపిస్తే
శ్రావణ మాసంలో కలలో తెల్ల పామును చూడటం శుభప్రదం. శివుడు ప్రసన్నుడైనప్పుడు కలలో తెల్ల పాములు కనిపిస్తాయని చెబుతారు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో తెల్ల పాముల జతను చూడటం అదృష్టం కలుగనుందని అర్ధం. ఇటువంటి కల రానున్న కాలంలో జీవితంలో సానుకూల మార్పులు, ఆర్థిక లాభాలు, విజయాన్ని సూచిస్తుంది.
కలలో మగ పాము, ఆడ పాము కనిపిస్తే
కలలో జంట పాములు కలవడం చూడటం సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రత్యేకించి ఆ జంట సంతోషంగా కలిసి ఉన్నట్లు కనిపిస్తే.. ఈ కల సంపద, శ్రేయస్సు, ఆనందానికి సంకేతం కావచ్చు. కొన్ని నమ్మకాలలో ఈ కల జీవితంలో అదృష్టం, విజయాన్ని కూడా సూచిస్తుందని చెబుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.