కలలో అందమైన అమ్మాయి ఇలా కనిపిస్తే.. అదృష్టం తుమ్మ జిగురులా పట్టినట్లే..
నిద్రలో ప్రతి మనిషికి కలలు రావడం సర్వ సాధారణం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం మన నిద్రలో వచ్చే ప్రతి కలకు లోతైన అర్ధం ఉంటుంది. ఆ కలలు భవిష్యత్ లో జరగనున్న మంచి చెడుల గురించి రించి ఆధారాలను అందిస్తాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి, విజయం..ఆర్థిక లాభాన్ని సూచిస్తాయి. అయితే మరికొన్ని రానున్న ఇబ్బందులను సూచిస్తాయి. ఈ రోజు కలలో అందమైన స్త్రీ కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం ఆ కలకు అర్ధం ఏమిటో తెలుసుకుందాం..

రాత్రి నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సర్వ సాధారణం. ఈ కలలు వివిధ రకాలుగా వస్తాయి. కొంతమందికి రాత్రి వచ్చిన కలలు ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా గుర్తుంటాయి. మరికొందరు రాత్రి వచ్చిన కలలు తెల్లారేసరికి మరచిపోతారు. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకి ఏదోక అర్థం ఉంటుంది. ఈ కలలు ఊహ మాత్రమే కాదు.. మన భవిష్యత్తు గురించి లోతైన అర్ధాన్ని తెలియజేసే గుణం కలిగి ఉంటాయి. ఈ కలలలో కొన్ని కొందరికి శుభప్రదంగా ఉంటాయి.మరికొన్ని అశుభకరంగా ఉంటాయి. కలలలో కనిపించే వ్యక్తులు, సంఘటనలు మన భవిష్యత్తు, వర్తమానంతో లోతుగా అనుసంధానించబడి ఉంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి, భవిష్యత్తులో విజయం, ఆర్థిక లాభాలను సూచిస్తాయి, మరికొన్ని ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలతలను సూచిస్తాయి. ఉదాహరణకు కలలో తనను తాను పెళ్లి కూతురుగా లేదా పెళ్లి కొడుకుగా చూసుకోవడం ఒక పెద్ద విపత్తును సూచిస్తుంది. ఇది మరణం వంటి దారుణమైన సంఘటనకు సంకేతం కూడా కావచ్చు.
రాత్రి వచ్చే కలలు శుభమా లేక అశుమా?
కలలలో మనం చూసే విషయాలు మన భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. కనుక కలలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఈ కలలు మన జీవితంలో జరిగే సంఘటనల ముందస్తు సూచనలు కావచ్చు. కొన్ని శుభప్రదమైనవి కావచ్చు, మరికొన్ని అశుభకరమైనవి కావచ్చు. కొన్ని కలలు భవిష్యత్తుకు నేరుగా సంబంధించినవి.. మరికొన్ని మీ దినచర్య లేదా ఒత్తిడికి ప్రతిబింబం కావచ్చు.
ఉదయం వచ్చే కలలకు అర్థం?
కలలు జీవితంలో వచ్చే ఆనందాలను, ఇబ్బందులను ముందే చెప్పగలవు. ఈ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకుంటే అనేక ఇబ్బందులను నివారించవచ్చు. తెల్లవారుజామ 4 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వచ్చే కలలు నిజమవుతాయని, జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు.
కలలో అందమైన స్త్రీ కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం అందమైన.. చక్కగా దుస్తులు ధరించిన స్త్రీని కలలో చూడటం అదృష్టం, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ కల మీ జీవితంలో త్వరలో సంపద, ఆనందం, శ్రేయస్సు వస్తుందని సూచిస్తుంది. లక్ష్మీ దేవి త్వరలో మీ ఇంటికి వస్తుందని నమ్మకం.
కలలో నగలు ధరించిన స్త్రీని చూస్తే
ఒక స్త్రీ నగలు ధరించినట్లు కలలు కన్నట్లయితే.. ఇది కూడా మంచి కలే.. మీ పెండింగ్ పని పూర్తి కాబోతోందని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు త్వరలో విజయం సాధిస్తారని ఈ కల సూచిస్తుంది. దీపావళి సమయంలో మీరు ఈ కలను చూసినట్లయితే, అది మీకు శుభప్రదం అవుతుంది.
అందమైన స్త్రీతో మాట్లాడినట్లు కలలు వస్తే
ఒక అందమైన స్త్రీతో మాట్లాడుతున్నట్లు కలలు వస్తే ఈ కల కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల సమాజంలో పెరగనున్న సామాజిక గౌరవం , ప్రతిష్టను సూచిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని కూడా ఈ కలకు అర్ధం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








