ఇంటి అందం కోసం కాదండోయ్.. ఇంట్లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచుకోవాలంటే?
ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే మొక్కల్లో మనీ ప్లాంట్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే చాలా మంది దీనిని ఇంటికి మంచి కల రావడం కోసం, ఇంటి అందం కోసం పెంచుకుంటుంటారు. కానీ ఇంటి అందం కోసమే కాదండోయ్, మనీ ప్లాంట్ ఇంట్లో ఎందుకు పెంచుకోవాలో ఈ విషయాలు తెలుసుకోండి అంటున్నారు పండితులు. మురి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.
Updated on: Oct 09, 2025 | 11:59 AM

ఇంట్లో అయినా సరే పెరట్లో అయినా సరే,ఎక్కడనా చాలా సులభంగా పెరిగే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒక్కటి. ఇది మట్టి లేకుండా నీటిలోనే పెరుగుతుంది. చాలా మంది దీనిని ఇంట్లో పెట్టుకుంటారు. కొందరు వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోగా, మరికొంత మంది అందం కోసం, ఇంకొందరు సంపద కోసం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు.కానీ ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఎవరైతే మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారో, ఆరోగ్యం పరంగా సతమతం అవుతున్నారో అలాంటి వారు తప్పకుండా ఇంటిలోపల మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీనిని ఇంటిలో పెంచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఇంటిలో సంపద పెరగడానికి ఇది కారణం అవుతుందంట. మనీ ప్లాంట్ ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో, వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా ఇంటిలోపల మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

ఇంటిలోపల మనీ ప్లాంట్ పెట్టుకోవడం వలన ఇది ఇంటి లోపలి గాలిని శుద్ధి చేస్తుందంట. మనీ ప్లాంట్ వాతావరణంలో ఉండే ఫార్మాల్డిహైడ్ , బెంజీన్, జైలీన్ వంటి హానీకరమైన వాటిని నశింప చేసి, మంచి గాలిని విడుదల చేస్తుందంట. అలాగే ఈ మొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

మనీ ప్లాంట్ ఇంటిని అందంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకోసమే చాలా మంది ఇంటి అలంకరణ కోసం మనీ ఫ్లాంట్ మొక్కలను ఇంట్లో ఎక్కువగా పెట్టుకుంటారు. అలాగే మనీ ప్లాంట్ మొక్కలు ఇంట్లో ఉండటం వలన వీటిని చూడగానే ఒత్తిడి తగ్గిపోయి, ప్రశాంతత లభిస్తుంది.

ఇక వాస్తు శాస్త్రంలో కూడా మనీ ప్లాంట్ కీలకంగా వ్యవహరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క మంచిగా ఎదుగుతూ ఉంటుందో, ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే సంపద కూడా పెరుగుతుందంట.( నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



