Konaseema: ఆషాడంమాసంలో రూ. 25 లక్షల కరెన్సీతో సత్తెమ్మతల్లి అలంకరణ.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యరు గున్నేపల్లిలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నరు శ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారు. ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. 25 లక్షల రూపాయలు అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ నిర్వహకులు 10, 20, 50, 100, 200, 500 నోట్లతో అత్యంత సుందరంగా అలంకరణ చేశారు.

Konaseema: ఆషాడంమాసంలో రూ. 25 లక్షల కరెన్సీతో సత్తెమ్మతల్లి అలంకరణ.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
Sattemma Talli

Edited By: Surya Kala

Updated on: Jul 22, 2025 | 12:50 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యరు గున్నేపల్లిలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నరు శ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారు. ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. 25 లక్షల రూపాయలు అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ నిర్వహకులు 10, 20, 50, 100, 200, 500 నోట్లతో అత్యంత సుందరంగా అలంకరణ చేశారు. సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు, భారీగా ఏర్పడిన క్యూ లైన్స్ ఏర్పడ్డాయి. కోరిన కోర్కెలుతీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందడంతో ఆలయానికి తరలివస్తున్నరు జనం. ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..