Makara Sankranti 2023
హిందువులు జరుపుకునే పండగల్లో మకర సంక్రాంతి ప్రధాన పండుగ. ప్రధానంగా ప్రతి సంవత్సరం జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు మకర సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ తేదీ నుండి సూర్య దేవుడు తన ప్రయాణం ఉత్తరాయణంలో మొదలు పెడతాడు. హిందూ గ్రంధాలలో సూర్య భగవానుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి ఏడాది పొడవునా మొత్తం 12 సంక్రాంతి ఉంటాయి. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు దానిని మకర సంక్రాంతి అంటారు. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి పండుగకు సంబంధించిన ప్రధాన విశేషాలను తెలుసుకుందాం.
మకర సంక్రాంతికి సంబంధించిన నమ్మకాలు:
- మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు కర్కాటక రాశి నుండి ఉత్తరాన కర్కాటక రాశిలోకి వెళ్లడాన్ని ఉత్తరాయణం అంటారు. అయితే దక్షిణాయన ప్రయాణం కర్కాటక రాశి నుండి దక్షిణ మకర రాశికి వెళ్లినప్పుడు ప్రారంభమవుతుంది. శాస్త్రాలలో ఉత్తరాయణాన్ని దేవతల పగలు అని, దక్షిణాయనాన్ని దేవతల రాత్రి అని అంటారు.
- మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు తన కొడుకు శనీశ్వరుడిని కలవడానికి అతని ఇంటికి వెళతాడు. జ్యోతిషశాస్త్రంలో.. శనీశ్వరుడు మకర రాశికి అధిపతి. వాస్తవానికి సూర్యుడు, శనీశ్వరుడు ఒకరితో ఒకరు శత్రుత్వం కలిగి ఉంటారు. అయితే సూర్య భగవానుడు స్వయంగా శనిదేవుడిని కలవడానికి వెళ్లడంతో.. ఈ పండుగను తండ్రి, కొడుకుల కలయికగా జరుపుకుంటారు. కనుక మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుని ఆరాధించడం.. శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో సూర్యుడు, శని వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి వాతావరణం మారడం ప్రారంభమవుతుంది. శరదృతువు ముగుస్తుంది. వసంతకాలం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి తరువాత.. పగటి సమయం పెరుగుతుంది.. రాత్రి సమయం తగ్గుతుంది.
- దేవతల రాత్రి మకర సంక్రాంతితో ముగుస్తుంది. పగలు ప్రారంభమవుతుంది. ఈ తేదీ నుండి, సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వెళతాడు.
- మకర సంక్రాంతి నాడు గంగ నదిలో చేసే స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భగీరథుని తపస్సుకు సంతోషించిన గంగామాత మకర సంక్రాంతి రోజున.. అతనిని అనుసరించి, కపిల ముని ఆశ్రమానికి చేరుకుని.. సముద్రంలో ఆమెను కలిసిందని నమ్ముతారు. ఈ కారణంగా.. మకర సంక్రాంతి నాడు గంగానదిలో స్నానానికి ప్రాముఖ్యత ఉంది. భగీరథుడు తన పూర్వీకుల తర్పణం ఇచ్చాడు. కనుక సంక్రాంతిని పెద్దల పండగ అంటూ..తమ పూర్వీకులను తలచుకుంటూ బట్టలు పెడతారు.
- దేశంలోని వివిధ ప్రాంతాలలో మకర సంక్రాంతిని అనేక రకాలుగా జరుపుకుంటారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో లోహ్రీ పేరుతో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీనిని పొంగల్ అని పిలుస్తారు. అస్సాంలో దీనిని భోగాలి బిహు అని పిలుస్తారు. బెంగాల్‌లో మకర సంక్రాంతిని ఉత్తరాయణంగా జరుపుకుంటారు. ఉత్తర బీహార్‌లో దీనిని ఖిచ్డీ అని పిలుస్తారు. గుజరాత్, రాజస్థాన్‌లలో మకర సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తారు.
- మాఘమాసంలో మకర సంక్రాంతి నాడు.. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు, దేవతలు, రాక్షసులు, మానవులు సహా అనేక ప్రాణులు ప్రయాగలోని పవిత్ర సంగమ తీరంలో స్నానం చేస్తారు.
- మకర సంక్రాంతిని ప్రధానంగా ఖిచ్డీ పండుగగా పరిగణిస్తారు. ఈ రోజున ఖిచ్డీని దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతగా పరిగణించబడుతుంది.
- మకర సంక్రాంతిని నువ్వుల సంక్రాంతి అని కూడా అంటారు. నువ్వుల దానానికి ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నువ్వులను దానం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది.
- మకర సంక్రాంతి నాడు బెల్లం దానం చేయడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. మకర సంక్రాంతి నాడు నెయ్యి, ఉప్పు దానానికి విశిష్టత ఉంది. ఈ దానాల వలన జీవితంలో భౌతిక సుఖాలు లభిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)